Drinker Sai Review:”డ్రింకర్ సాయి” రివ్యూ అండ్ రేటింగ్!!

drinker sai review and rating

మూవీ: Drinker Sai
నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి
సినిమాటోగ్రఫి: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: శ్రీ వసంత్
విడుదలతేదీ: 27-డిసెంబర్-2024

Drinker Sai Review And Rating

టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం “డ్రింకర్ సాయి”. ధర్మ, ఐశ్వర్య శర్మ లు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంతో కిరణ్ తిరుమలశెట్టి దర్శకుడిగా పరిచయం అయ్యారు. చిన్న బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ నుంచే మంచి హైప్ క్రియేట్ చేసింది. సినిమా ద్వారా కొత్త నటీనటులు పరిచయం కాగా ఈ చిత్రానికి ఎలా స్పందించారో వివరంగా ఈ సమీక్షలో చూద్దాం.

కథ: ధనవంతుడైన అనాధ సాయి (ధర్మ). తల్లితండ్రి లేకపోవడంతో జల్సాలతో జీవితాన్ని గడిపేస్తుంటారు. నిత్యం తాగడం, సిగరెట్ వంటి అలవాట్లతో ఉన్న సాయి కి నేచురోపతి డాక్టర్ భాగీ (ఐశ్వర్య శర్మ) పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు సాయి. కానీ, మందు, సిగరెట్ వంటి అలవాట్లను అసహ్యించుకునే భాగీతో సాయి ప్రేమను ఎలా అంగీకరించింది అనేది ఆసక్తికరం. భాగీ ప్రేమను గెలుచుకోవడం కోసం సాయి చేసిన ప్రయత్నాలు? భాగీ సాయిని అంగీకరించిందా? సాయి జీవితానికి ఈ ప్రేమ ఎలా మలుపు తీసుకువచ్చిందనేది అసలు కథ.

నటీనటులు: హీరో ధర్మ కాకాని తన రెండో చిత్రంలో అద్భుతంగా నటించాడు. తన డ్యాన్సులు, ఫైట్లు, ఎమోషనల్ సీన్లలో పర్‌ఫెక్షన్ చూపించి, పాత్రకు తగిన మెచ్యూరిటీని చూపించాడు. మద్యం మత్తులో ఉండే యువకుడి పాత్రలో అతని హావభావాలు పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయాయి. క్లైమాక్స్‌లో ఎమోషనల్ సీన్స్‌ను సమర్థవంతంగా పోషించాడు. ఇక హీరోయిన్ న్ ఐశ్వర్య శర్మ క్యూట్‌గా కనిపిస్తూ, ఎమోషనల్ సీన్స్‌లో మెప్పించింది. అతిథి పాత్రలో శ్రీకాంత్ అయ్యాంగార్, పోసాని కృష్ణమురళి తమ పాత్రల్లో మెప్పించారు. సమీర్, కిరాక్ సీత, రీతు చౌదరి వంటి ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. SS కాంచి తన పాత్రతో ప్రేక్షకులను కాసేపు నవ్వించగా ఫన్ బకెట్ రాజేష్, భద్రం హాస్యాన్ని పంచడంలో వారి వంతు పాత్రను పూర్తి చేశారు.

సాంకేతిక నిపుణులు: కిరణ్ తిరుమలశెట్టి రాసుకున్న కథ చాలా బాగుంది. టెక్నికల్‌గా సినిమాను బలంగా మలచడంతో పాటు మంచి కథ, కథనం తోడై ప్రేక్షకులను అలరిస్తుంది. శ్రీ వసంత్ సంగీతం “డ్రింకర్ సాయి” సినిమాకు ప్రధాన బలం. పాటలు ఫోక్ టచ్‌తో వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది.మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ప్రొడక్షన్ వాల్యూస్‌ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

సంగీతం

నటీనటుల ప్రదర్శన

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

సినిమా నిడివి

అక్కడక్కడా సాగతీత

తీర్పు: “డ్రింకర్ సాయి” ఒక ఆసక్తికరమైన కాన్సెప్ట్‌. మితిమీరిన అలవాట్లు జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో అన్న అంశాన్ని చక్కగా చూపించారు. యువతలో మందు, సిగరెట్ వంటి వ్యసనాలపై ఆలోచన కలిగింస్తూ చేసిన ఒక మంచి ప్రయత్నం.యువతకి సందేశాన్ని బలంగా చూపించడంతో డ్రింకర్ సాయి ఎక్కువ మంది హృదయాలను తాకుతుందనిపిస్తుంది.

రేటింగ్: 3.25/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *