Drumstick: మునగకాయలు తింటున్నారా…అయితే ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది ?
Drumstick: మునగకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని ఎక్కువగా సాంబార్ రూపంలో తయారు చేసుకొని తింటూ ఉంటారు. మునగకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. మునగకాయలో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉంటాయి. ఇందులో విటమిన్లు, పోషకాలు, కాల్షియం, ఖనిజాలు అధికంగా ఉంటాయి.

Drumstick Health Benefits, Nutrition, Uses, Recipes
మునగకాయలు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మునగకాయలను కూర రూపంలో కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇది మన శరీరంలో ఏర్పడిన ఇన్ఫెక్షన్లను తొలగించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడడంలో మునగ కాయలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇందులో విటమిన్లు, ఐరన్, జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా తెల్ల రక్త కణాల ఉత్పత్తికి ఎంతగానో సహాయం చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా జీవక్రియను మెరుగుపరుస్తుంది.
కడుపులో ఏర్పడే అనేక రకాల ఇన్ఫెక్షన్లను తొలగిస్తుంది. మునగకాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. అదేవిధంగా రక్తాన్ని శుభ్రపరిచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మునగకాయలలో బలమైన యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను తొలగించే సామర్థ్యం కలదు. మునగకాయలు శరీరంలో ఏర్పడిన సూక్ష్మ క్రిములను తొలగించడానికి సహాయం చేస్తాయి. మునగకాయలు తినడం వల్ల శరీరానికి అధిక శక్తి అందుతుంది. నీరసం, అలసటను తొలగిస్తాయి. ఐరన్ అధికంగా ఉన్న మునగకాయలు తినడం వల్ల శరీరంలో ఏర్పడిన బలహీనత తొలగిపోతుంది.
వారానికి ఒకసారి అయినా మునగకాయలు తప్పకుండా తినాలని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు. మునగ కాయలు శారీరక సమస్యలను కూడా దూరం చేస్తాయి. చాలావరకు మునగ కాయలను శారీరక మానసిక సమస్యల నివారణకు మందులలో వాడుతూ ఉంటారు. మునగకాయలు మాత్రమే కాకుండా మునగ ఆకులను కూడా కూర రూపంలో తయారు చేసుకుని తింటారు. అంతే కాకుండా ఈ ఆకులను జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకుని తాగడం వల్ల చాలా మంచిది. ముఖ్యంగా మునగాకుతో డయాబెటిస్ పేషెంట్లు జ్యూస్ చేసుకుని తాగినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.