Dry Fruits: ఎండాకాలంలో డ్రై ఫ్రూట్స్ తింటున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?
Dry Fruits: చాలా మంది డ్రై ఫ్రూట్స్ ను స్నాక్స్ రూపంలో లేదా ఉదయం నానబెట్టుకుని తింటూ ఉంటారు. అయితే వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదేనా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంది. బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, అంజీర, ఎండు ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్, సన్ ఫ్లవర్ సీడ్స్ ఇలాంటివి మంచి పోషకాహారం. వీటిని తిన్నట్లయితే రోజంతా నీరసం లేకుండా చాలా చురుగ్గా ఉంటారు.

Dry Fruits To Eat In Summer Without Inducing Summer Heat
వీటిని ఒక పిరికెడు తిన్నట్లయితే ఆకలి అనిపించదు. డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని క్యాన్సర్ నిరోధించడంలో ఎంతగానో సహాయం చేస్తాయి. అందుకే డ్రై ఫ్రూట్స్ ను సూపర్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటారు. ఆరోగ్యపరంగా డ్రై ఫ్రూట్స్ చాలా మంచివి. ఇందులో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ వేడి స్వభావాన్ని కలిగి ఉంటాయి. వేసవికాలంలో ఎండు ద్రాక్ష తినడం చాలా మంచిది.
Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా ?
ఇందులో పొటాషియం, ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవికాలంలో డ్రై ఫ్రూట్స్ ను నీటిలో నానబెట్టుకుని తినాలి. దానివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో రకాలుగా అందుతాయి. వేసవికాలంలో బాదంపప్పు తినడం కూడా చాలా మంచిది. అయితే వీటిని నీటిలో నానబెట్టుకొని తినడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది. రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి ఉదయం వాటిని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వాల్ నట్స్ లో ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.
Revanth Reddy: వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా ?
ప్రతిరోజు వాల్నట్స్ రెండు మూడు తిన్నట్లయితే మెదడు చురుకుగా పనిచేస్తుంది. వేసవికాలంలో ఆప్రికాట్ కూడా తినడం కూడా చాలా మంచిది. ఉదయం పూట రెండు మూడు ఆప్రికాట్లు తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా ఆప్రికాట్ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.