Dubbaka Mla: రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతోంది… దుబ్బాక ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు ?
Dubbaka Mla: తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు అందరూ చూస్తున్నారని గులాబీ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలని… కోరుతున్నారని… దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా ఓ ఈవెంట్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి… రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేశారు.

Dubbaka Mla comments on revanth reddy government
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని… ప్రజలతో పాటు బిల్డర్లు అలాగే పారిశ్రామికవేత్తలు కూడా డిసైడ్ అయినట్లు బాంబు పేల్చారు కొత్త ప్రభాకర్ రెడ్డి. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని.. ఆ ఖర్చులు తామే భరిస్తామని అంటున్నారని… సంచలన వ్యాఖ్యలు చేశారు కొత్త ప్రభాకర్ రెడ్డి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు.
Rajamouli film: మహేష్ ను చూసి జక్కన్న కూడా అలానే తయరయ్యాడే!!
వచ్చేది గులాబీ పార్టీ ప్రభుత్వమే అంటూ… ధీమా వ్యక్తం చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కెసిఆర్ పాలనలో అభివృద్ధి దూసుకు వెళ్లిందని… కానీ ఇప్పుడు పాలన పడకేసిందన్నారు. ప్రజలు కూడా ఇప్పుడు గులాబీ పార్టీని కోరుకుంటున్నారన్నారు.
Allu Arjun film: అల్లు అర్జున్ ను అవమానించే విధంగా యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు..ఇలా తయ్యారయ్యరెంట్రా!!