Guava: చలి కాలంలో జామపండ్లు తింటున్నారా.. అయితే.. జాగ్రత్త ?

Guava: జామ పండు చూడడానికి చాలా బాగుంటుంది. దీనిని తినాలని ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఇది రుచిలోనే కాకుండా పోషకాలను అందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో నారింజ పండ్ల నుంచి జామ పండ్ల వరకు సీజనల్ పండ్లు వస్తూనే ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. శీతాకాలం సీజనల్ పండ్లలో జామపండు ఒకటి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనితో పాటు బి కాంప్లెక్స్, విటమిన్లు, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి.

Eat Guava Get These Health Benefits

జామ పండులో ఖనిజాలు కూడా అధికంగా లభిస్తాయి. వీటిలో పీచు అధికంగా ఉంటుంది. అందువలనే జామ పండు తింటే చక్కెర నిల్వలు పడిపోకుండా ఉంటాయి. రక్త పోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని కొవ్వును తొలగిస్తాయి. జామ పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి. జామ పండు శరీరంలోని హానికర ఫ్రీ రాడికల్స్ బయటకు పంపిస్తాయి. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా కాపాడుతాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి. అయితే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు జామపండును అస్సలు తినకూడదు. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు లేదా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు జామ పనులను తినకూడదు. జామ పండు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తాయి. దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా జామపండును తినకూడదు. అలాగే శస్త్ర చికిత్సకు ముందు ఆ తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా జామ పండ్లను తినకూడదు. జామ పండును తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించిన, అలర్జీ సమస్యలు ఉన్న జామపండు తినడం మానుకోవాలని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *