Elaichi Water: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల పానీయాలు సేవిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యాలకుల నీటిని ప్రతి రోజు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ యాలకుల నీటిని తాగడం వల్ల జలుబు, గొంతు నొప్పి నుండి బయటపడవచ్చు. ఈ నీరు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. Elaichi Water

Elaichi Water Benefits we can prevent cancer also

ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడడమే కాకుండా కడుపునొప్పి వంటి సమస్యలతో ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల గుండెపోటు లాంటి ప్రమాదాలను తగ్గిస్తాయి. యాలకులకు డిప్రెషన్ తో పోరాడే ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. ప్రతిరోజు టీలో యాలకులను వేసి లేదా యలాకుల పౌడర్ గాని వేసుకొని తాగితే మానసికంగా ఆరోగ్యం బాగుంటుంది. అస్తమా, మలబద్ధకం వంటి సమస్యలను తొలగించవచ్చు. అందువల్లనే ప్రతిరోజు యాలకులు వేసి మరిగించిన నీటిని తీసుకోవడం వల్ల జీర్ణసంబంధిత సమస్యలు తొలగిపోతాయి. Elaichi Water

Also Read: Oppo Reno 12 Series: ఒప్పో రెనో 12 సిరీస్ వస్తోంది..ధర, ఫీచర్స్‌ ఇవే..!

యాలకులకు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది నోటిని, దంత పరిశుభ్రతకు సహాయం చేస్తుంది. యాలకులలో పీచు పదార్థం ఉండడం వల్ల శరీరానికి ఫైబర్ ని అందిస్తుంది. ముఖ్యంగా షుగర్, బీపీ పేషెంట్లు యాలకులను తప్పకుండా వాడినట్లయితే షుగర్, బీపీ కంట్రోల్ లో ఉంటుంది. యాలకులను నీటిలో వేసి చిన్న పిల్లలకు తాగించినట్లయితే పెరుగుదల బాగుంటుంది. చాలామంది పిల్లలు అలా నీటిని తాగడానికి ఇష్టపడరు. అందువల్ల పాలలో రెండు యాలకులను వేసి మరిగించి ఆ పాలని తాగించాలి. Elaichi Water

ఇలా చేయడం వల్ల రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాలకులలో కెమికల్ సినియోల్ ఉండడం వల్ల దుర్వాసన బ్యాక్టీరియాలను తొలగించడానికి, దంతక్షయాన్ని నిరోధించడానికి శక్తివంతంగా పనిచేస్తుంది. యాలకులలో యాంటీబయోటిక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో అనేక వ్యాధుల నుంచి పోరాడుతుంది. అందువల్లనే ప్రతిరోజు యాలకుల నీటిని తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. Elaichi Water