Jos Buttler: భార్యలు వెంట ఉంటేనే బాగా ఆడతాం ?
Jos Buttler: ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ సిరీస్ సమయంలో ఒకటి మనతో కుటుంబం కలిసి ఉండడం ఆటపై ప్రభావం చూపదని చెప్పాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్. కోవిడ్ అనంతరం తన ప్రియమైన వారితో ఉండడం మరింత ముఖ్యమైనది అంటూ బీసీసీఐ కొత్త రూల్స్ పై వ్యంగ్యంగా మాట్లాడారు. భారత్ తో టి20 ప్రారంభానికి ముందు జోస్ బట్లర్ అనౌన్స్ చేశాడు.
England white ball captain Jos Buttler on BCCI Rules
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో సిరీస్ లను కోల్పోయిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ పరిమితిని విధించింది. ఈ నిర్ణయం పట్ల కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సంతోషంగా లేరు. మిగతా ఆటగాళ్ల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది. బట్లర్ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో జీవిస్తున్నాం. ఇలాంటి సమయంలో కుటుంబం కూడా కలిసి ఉండాలి అంటూ చెప్పుకోచ్చారు. ఒక ఆటగాడిగా క్రికెట్ మైదానంలో చాలా సమయం పెట్టుబడి పెడతారు.
ఆటగాళ్లు చాలా కాలం పాటు తమ ఇళ్లకు దూరంగా ఉంటారు. కుటుంబంతో కలిసి ఉండడం క్రీడలపై ప్రభావం చూపదు అంటూ వెల్లడించాడు. చాలా కాలం పాటు ఇతర దేశాల్లో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లకు మానసిక శోభ కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఫలితాలు మనకు అనుకూలంగా లేనప్పుడు కుటుంబ సభ్యులతో గడపడం చాలా ముఖ్యం అంటూ వ్యాఖ్యానించాడు ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్.