Soundarya: మంచు ఫ్యామిలీలోని అందరి కన్ను సౌందర్య బంగ్లా మీదే.. 100 కోట్ల వ్యాల్యూ.?


Soundarya: ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు జరగడం కొడుకులు క్రమశిక్షణ రాహిత్యంగా ఉండడం ఎంతోమందికి ఆశ్చర్యం అనిపిస్తోంది.ముఖ్యంగా డిసిప్లేన్ అంటూ మాట్లాడే మోహన్ బాబుకి ఇది కాస్త అవమానమే అని చెప్పుకోవచ్చు. అయితే ఆస్తుల విషయంలోనే వీరి మధ్య గొడవ జరుగుతుందని సమాచారం.

Everyones eyes in the Manchu family are Soundarya bungalow

Everyones eyes in the Manchu family are Soundarya bungalow

ముఖ్యంగా మోహన్ బాబు మంచు మనోజ్ మౌనికలపై కేస్ పెట్టి మనోజ్ మౌనికలు నా ఇంటిని లాక్కున్నారని, తనపై తన కొడుకు కోడలు దాడి చేశారని,వారి వల్ల తనకు ప్రాణహాని ఉంది అని వాట్సప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు మోహన్ బాబు.అయితే మనోజ్ కూడా మోహన్ బాబు వల్ల ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రధానంగా గొడవ జరిగేది జల్ పల్లి లోని మోహన్ బాబు కట్టుకున్న ఇంటి గురించేనని తెలుస్తోంది.అయితే శంషాబాద్ శివారులో జల్ పల్లిలో మోహన్ బాబు లగ్జరీ ఇల్లు నిర్మించారు. (Soundarya)

Also Read: Mohan Babu: అన్ని గొడవలకు కోడలే కారణం..7 నెలల మనవరాలిని పనిమనిషికి ఇచ్చి..?

అయితే ఇది సౌందర్య ప్రాపర్టీ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సౌందర్య మరణించాక సౌందర్య కుటుంబ సభ్యులు డబ్బుల కోసం మోహన్ బాబు కి అమ్మేసారు అని కొంతమంది అంటుంటే.. మరి కొంతమందేమో.. మోహన్ బాబు వాటిని లాక్కున్నారని అంటున్నారు. కానీ ఇందులో అసలు నిజం ఎంటో తెలియదు. అయితే జల్ పల్లిలోని ఆ నివాసం పైనే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ లో ఉన్న వాళ్ళందరూ చూపు ఉందని,ఆ ఇంటి కోసమే అటు విష్ణు, ఇటు మనోజ్,ఇటు మోహన్ బాబు ముగ్గురు పోట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది.

Everyones eyes in the Manchu family are Soundarya bungalow

అయితే మనోజ్ మాత్రం జల్ పల్లి నివాసంలో తానే ఉండాలి అనుకుంటున్నారట.కానీ మోహన్ బాబు మాత్రం తన ఇంటిని లాక్కున్నారని కొడుకు పైనే కేసు పెట్టారు. ఇలా అందరి చూపు ఓకే ఇంటిపై ఉండడంతో ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే జల్ పల్లి లో ఉన్న ఆ నివాసం ఖరీదు దాదాపు 100 కోట్లని, ఎంతో లగ్జరీగా కట్టుకున్న ఈ ఇంటిని మోహన్ బాబు తన కొడుకులకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది.(Soundarya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *