వాసవి కాలేజీలో చదువుతున్న శ్రేయ అనే సెకండియర్ స్టూడెంట్ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం మణికొండలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ suicide note లో ఫ్యాకల్టీ వేధింపుల గురించి స్పష్టంగా రాసి ఉండటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
Suicide Note కీలక ఆధారంగా
ఈ ఘటన జూలై 21న బయటపడింది. నార్సింగి పీఎస్ పరిధిలోని వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రేయ పరీక్షల్లో తన వైపు నుంచి ఎలాంటి తప్పు లేకపోయినా, కొంతమంది ఫ్యాకల్టీ సభ్యులు తనను టార్గెట్ చేసుకున్నారని ఆత్మహత్య లేఖలో పేర్కొంది. ఒకసారి పరీక్ష హాలుకు మొబైల్ తీసుకెళ్లినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా పదే పదే అవమానించడం, నీలాంటి వాళ్లు ఎప్పటికీ మారరు అంటూ కించపరచడం వంటివి జరిగాయని లేఖలో రాసింది.
ఈ సూసైడ్ నోట్ కాలేజీలోని స్టూడెంట్స్, వాళ్ల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. చాలా మంది విద్యార్థినులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాలేజీ మేనేజ్మెంట్ ఇప్పటివరకు ఈ విషయంలో స్పందించలేదు, అయితే పోలీసులు మాత్రం ఫ్యాకల్టీ సభ్యులను ప్రశ్నించే పనిలో ఉన్నారు.
పోలీస్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి శ్రేయ సూసైడ్ నోట్ ను, సెల్ ఫోన్ డేటాను సేకరించి విచారణ జరుపుతున్నారు. ఫ్యాకల్టీ వేధింపుల ఆరోపణలు నిజమేనా, ఎవరు బాధ్యులు అనే విషయంపై దృష్టి పెట్టారు. ఈ కేసులో నిందితులు కాలేజీ సిబ్బంది అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


