Cooking Oil Scam: కల్తీ వంటనూనె.. జంతువుల శరీర భాగాలతో టాప్ బ్రాండ్స్ ఆయిల్స్ సేల్!!

Cooking Oil Scam: హైదరాబాద్ మలక్‌పేట గంజ్ ప్రాంతంలో నిర్వహించిన టాస్క్ ఫోర్స్ దాడిలో భారీ నకిలీ వంట నూనె తయారీ ముఠా బహిర్గతమైంది. ప్రసిద్ధ బ్రాండ్‌ల పేరుతో నకిలీ లేబుళ్లు అతికించి, తక్కువ నాణ్యత గల ఆయిల్‌ను వినియోగదారులకు విక్రయిస్తున్న వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు అధిక లాభాల కోసమే వినియోగదారుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు.
Fake Cooking Oil Scam Hyderabad Exposed
ఈ ముఠా అసలైన నూనె కంపెనీల డిస్ట్రిబ్యూటర్లుగా నటిస్తూ, కొద్దిపాటి అసలైన నూనెను కొనుగోలు చేసి, కల్తీ నూనెను అతి చౌకగా మార్కెట్‌లోకి విక్రయిస్తోంది. నకిలీ లేబుళ్లు అతికించి, తక్కువ ధరలకు డీలర్లకు విక్రయించడం ద్వారా వినియోగదారులను మోసం చేస్తున్నారు. ఈ నకిలీ నూనె MRP కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటంతో ప్రజలు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారో తెలియకుండా కొనుగోలు చేస్తున్నారు.
ఈ కల్తీ నూనె వ్యాపారం హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా విస్తరించింది. రాత్రి సమయంలో లారీల నుంచి డ్రమ్ములను దించుతూ, నకిలీ బ్రాండ్ స్టిక్కర్లు అతికించిన 15 లీటర్ల డబ్బాలలో నింపి డీలర్లకు సరఫరా చేస్తున్నారు. దీని వల్ల ప్రజలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది.
హైదరాబాద్ పోలీసులు GHMC ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు నకిలీ నూనె విక్రయాలను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. “మార్కెట్” లో అందుబాటులో ఉన్న “బ్రాండెడ్ ఆయిల్” తక్కువ ధరకు అందించినా “కన్స్యూమర్స్” జాగ్రత్తగా ఉండాలి.