Fan wars: సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వింత చేష్టలు.. వేరే హీరోపై నెగెటివ్ చేస్తున్నారా?

Fan wars: ప్రస్తుతం సోషల్ మీడియా లో ఐడెంటిటీ లేకుండా కొంతమంది ఫ్యాన్స్ పేరిట చేస్తున్న వికృత చేష్టలు రోజు రోజుకు శృతిమించి పోతున్నాయి. తమ హీరో ను మంచిగా చూపించుకునేందుకు వేరొక హీరో పై దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకు తాజాగా జరిగిన ఒక ఉదాహరణ విజయ్ దేవరకొండ పై నెగెటివ్ స్ప్రెడ్ చేయడం. బాలీవుడ్ లో ఓ జర్నలిస్ట్ గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో జరిగిన ఓ పీఆర్ యాక్టివిటీ ని ఎక్స్ పోజ్ చేశాడు.
Fan wars escalate in Telugu industry
అదేంటంటే గేమ్ ఛేంజర్ 1st డే కలెక్షన్స్ 186 కోట్లు అని చెప్పారు కానీ ఆ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ కూడా అంత లేదు.. హిందీ లో కార్పొరేట్ బుకింగ్స్ చేశారు.. ఆర్గానిక్ గా ఆ సినిమా కి వెళ్ళింది కొంతమందే అయితే కార్పొరేట్ బుకింగ్ చేసి సినిమా హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆ సినిమా కి పెద్దగా హిట్ రాలేదు. అంటూ చెప్పుకొచ్చాడు. కానీ దాన్ని కప్పి పుచ్చడానికి మరొక వీడియోని మెగా ఫ్యాన్స్ స్ప్రెడ్ చేయడానికి చూశారు. దాని కింద వారి అభిమానులే ఎక్కువగా కామెంట్స్ పెట్టడం గమనార్హం.
అంతేకాదు హీరో నాని ఫ్యాన్స్ కూడా ఆ వీడియో కి మద్దతుగా విజయ్ దేవరకొండ ను విమర్శిస్తూ కామెంట్స్ పెట్టారు. ఇంతకీ విజయ్ దేవరకొండను సదరు జర్నలిస్ట్ ఏమన్నారంటే బాలీవుడ్ మీడియా విజయ్ దేవరకొండ పెద్ద సూపర్ స్టార్ లాగా చూపిస్తుంది. కానీ అయన లైగర్ సినిమాకు కలెక్షన్స్ వచ్చిందే లేదు. కేవలం ఐదు కోట్లే ఆ సినిమాకు కలెక్షన్స్ వచ్చాయి అన్నట్లు చెప్పాడు. అయితే వాస్తవంగా మొదటి రోజు లైగర్ సినిమా కు 33 కోట్ల గ్రాస్ రావడం, ఒరిజినల్ గా వచ్చిన దాన్ని చెప్పకుండా ఫేక్ కలెక్షన్స్ రిపోర్ట్ చెప్పడం దాన్ని మెగా ఫ్యాన్స్ ఈ విధంగా తమపై వచ్చిన విమర్శను దాచిపెట్టడానికి మరొక హీరోపై ఉన్న విమర్శను ఇలా ఎలివేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్.
చూస్తుంటే ఈ ఫ్యాన్స్ వార్స్ ఎంతవరకు వెళతాయో చూడాలి. చాలారోజులుగా హీరో విజయ్ దేవరకొండ పై జరుగుతున్న నెగెటివిటీ ని చూస్తూనే ఉన్నారు. అయన సినిమా కు ఏ హీరో కు లేని నెగెటివిటీ స్ప్రెడ్ అవుతుంది. కారణం అందరికి తెలుసు.. పదులకొద్దీ సినిమాలు చేసిన రాని స్టార్ డమ్, క్రేజ్, బాలీవుడ్ మేనియా ఈ హీరోకి కేవలం రెండు మూడు సినిమాలతో రావడం నిజంగా ఏ హీరోకైనా కడుపుమంట అని చెప్పాలి. అందుకేనేమో బహుశా ఈ హీరో పై ఇంతటి నెగెటివ్ ఎటాక్ జరుగుతుంది.