Kohli – Gambhir: గంభీర్ – కోహ్లీ సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ సీరియస్..?
Kohli – Gambhir: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రస్తుతం మూడవ టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ ఇప్పటికే నాలుగు రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. Kohli – Gambhir
Fans Serious On Kohli – Gambhir
టీమిండియా మాత్రం… ఫాలో ఆన్ చాలా కష్టంగా దాటింది. నాలుగో రోజు ముగిసేసరికి తొమ్మిది వికెట్లు పడిపోయాయి. అయితే… ఆకాష్ దీప్ అద్భుతంగా చివరిలో బ్యాటింగ్ చేశాడు. దీంతో టీమ్ ఇండియా ఫాలో ఆన్ తప్పించుకుంది. ఈ నేపథ్యంలో ఆకాష్ దీప్ ఆడే షాట్లపై… గౌతమ్ గంభీర్ అలాగే విరాట్ కోహ్లీ.. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. Kohli – Gambhir
Also Read: Jogi Ramesh: వైసీపీకి మరో షాక్… టిడిపిలోకి జోగి రమేష్?
డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చొని ఎగిరి గంతేశారు. అయితే టీమిండియా… ప్రమాదంలో ఉన్నప్పుడు ఇలా ఎగిరి గంతేయడం… ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడటం చేతకాదు కానీ… ఇలా డ్రెస్సింగ్ రూమ్ లో… సంబరాలు చేసుకుంటారా అని ఈ కోహ్లీపై అటు గంభీర్ పై మండిపడుతున్నారు ఫ్యాన్స్. ఇకనైనా రెండో ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ ఆడాలని కోరుతున్నారు ఫ్యాన్స్. Kohli – Gambhir