Fatima Sana Shaikh: మళ్ళీ.. మళ్ళీ..అన్నిటికి సిద్ధంగా ఉన్నావా అని అడిగేవాడు.. క్యాస్టింగ్ కౌచ్ గురించి దంగల్ బ్యూటీ!!
Fatima Sana Shaikh: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్య అనేది పెద్ద చర్చనీయంశ విషయం అవుతుంది, ఎందుకంటే అనేక వేధనలు, దారుణమైన అనుభవాలు ఇండస్ట్రీ లో ఉన్న ఆడవారికి ఉన్నాయి. బాలీవుడ్ నటి ఫాతిమా సనా షేక్ దీని గురించి మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘దంగల్’ సినిమాతో క్రేజ్ దక్కించుకున్న ఈ నటి, తాజాగా ఈ ఇండస్ట్రీ యొక్కమరో కోణాన్ని తన అనుభవం ద్వారా వెల్లడించింది.
Fatima Sana Shaikh casting couch
ఒక పోడ్కాస్ట్‌లో నిజాయితీగా మాట్లాడిన ఫాతిమా, ప్రతి రంగంలో మంచిని, చెడును ఎదుర్కొంటామని చెప్పింది. కొంతమంది వ్యక్తులు తమ పవర్ ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారని చెప్పింది. ఒక సినిమా క్యాస్టింగ్ ప్రక్రియలో, ఓ పాత్రకు తాను ఫిట్ గా ఉన్నా కూడా, ఒక వ్యక్తి తను “ప్రతి విషయం కోసం సిద్ధంగా ఉన్నావా?” అని కొన్ని సార్లు అడిగినట్లు గుర్తు చేసింది.
అలాగే, హైదరాబాద్‌లో ఎదురైన ఒక సంఘటన గురించి ఆమె వివరించింది, దక్షిణాదిలో మంచి ప్రదర్శన చేస్తే బాలీవుడ్‌లో మంచి అవకాశాలు వస్తాయని చాలా మంది నమ్ముతున్నారు. కొంతమంది నిర్మాతలు అసభ్యమైన ప్రశ్నలు అడిగినట్లు ఫాతిమా చెప్పింది. ఫాతిమా ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ అలా ప్రవర్తించలేదని అంగీకరించింది, కానీ ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని ఆమె పేర్కొంది. నటి, నటులు ఈ విధమైన దోపిడీపై మాట్లాడడం చాలా ముఖ్యం అనే ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.