Fear Movie Review: గ్లామర్ స్టార్ వేదిక “ఫియర్” మూవీ రివ్యూ!!

Fear (2024) - Movie | Reviews, Cast & Release Date in jejuri- BookMyShowమూవీ నేమ్: Fear Movie
నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, తమిళ జయప్రకా, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు
సాంకేతికత: మ్యూజిక్ – అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ
లిరిక్స్ – కృష్ణ కాంత్
కొరియోగ్రఫీ – విశాల్
నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి
కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని

హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన “ఫియర్” (Fear) సినిమా ఈరోజే విడుదలైంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని డా. హరిత గోగినేని దర్శకత్వంలో దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. అరవింద్ కృష్ణ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించారు. విడుదలకు ముందే “ఫియర్” ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుని ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ: సింధు, ఇందు (వేదిక).. కవల పిల్లలు. చిన్న తనం నుండి కలిసి మెలిసి పెరిగిన వీరి మానసిక స్థితి విరుద్ధంగా ఉంటుంది. వారిద్దరికి కామన్ ఫ్రెండ్ అయిన సంపత్ (అరవింద్ కృష్ణ) అంటే సింధు కి చాలా ఇష్టం. అతను తనకు తప్పా ఎవరికీ దక్కొద్దు అనుకుంటుంది. ఆఖరికి ఆమె అక్కకి కూడా.. అంతేకాదు ఆమెలో భయం ఎక్కువ. కథ చెప్పిన బూచోడు నిజంగా తన ను వెంటాడుతుంటాడు అనుకుంటుంది. తన మానసిక పరిస్థితి సరిగ్గా లేదని ఆమెను ఆసుపత్రిలో చేర్పిస్తాడు. అక్కడ డాక్టర్ తో తనకు సంపత్ కావాలని చెప్తుంది. క్యాంపు పనిమీద ఊరికి వెళ్ళిన సంపత్ ఎప్పుడొస్తాడో తెలీదు.అసలు సింధు కి ఏమైంది. ఆమెకున్న మానసిక వ్యాధి ఏంటి? అసలు సాయాజి షిండే, సత్య కృష్ణ ఎవరు? వారికి సింధుకి సంబంధం ఏంటి? అంతలా భయపడడానికి అసలు కారణం ఏమిటి? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు: వేదిక రెండు విభిన్న పాత్రల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె సింధు మరియు ఇందు పాత్రలకు జీవం పోసింది. ఈ పాత్రలకు వేదికను ఎంపిక చేయడం కథకు పర్‌ఫెక్ట్ అనిపించింది. హ్యాపీ, సాడ్, గ్లామర్ వంటి ప్రతి ఎమోషన్‌ను వేదిక అద్భుతంగా పలికించింది. ఆమె నటన కథను మరింత బలంగా మార్చింది. అరవింద్ కృష్ణ రోల్ చిన్నదే అయినప్పటికీ, అతని ప్రదర్శన ఎంతో ప్రభావవంతంగా నిలిచింది. జయప్రకాష్, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతి పాత్ర కథలో సజీవంగా కనిపించేలా చేశారు. కథనానికి మరింత బలం చేకూర్చారు. అన్ని పాత్రలు అర్థవంతంగా ఉండడంతో పాటు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి.

సాంకేతిక నిపుణులు: ఈ సినిమా కి ప్రధాన బలం సంగీతం. అనూప్ రూబెన్స్ అందించిన నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. కొన్ని సన్నివేశాలకు అనూప్ సంగీతం సహజంగా ఉండడంతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అలాగే ఆండ్రూ అందించిన సినిమాటోగ్రఫీ. అయన కెమెరా పనితనం వల్లే సినిమా ఇంత రిచ్ గా వచ్చింది. విజువల్స్ కథకు తగ్గట్టు వచ్చేలా మంచి వర్క్ చేశారు. సినిమాకు ఎడిటింగ్ చాలా ముఖ్యం. దర్శకురాలు డా. హరిత గోగినేని దర్శకత్వంతో పాటు ఎడిటింగ్ చేయడంతో సినిమా ను చాలా బాగా చేయగలిగింది. కథనాన్ని ఇంట్రెస్టింగ్ గా మలచి ప్రేక్షకుల థ్రిల్‌ను మరింత పెంచింది. సస్పెన్స్ థ్రిల్లర్ అయినప్పటికీ, ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా తమ కుటుంబంతో కలిసి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసేందుకు వీలుగా హరిత చిత్రాన్ని రూపొందిచింది. స్క్రిప్ట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రొడక్షన్ చేయగా మంచి క్వాలిటీ సినిమాలో కనిపిస్తుంది.

తీర్పు : ఈ కథలో ప్రతి పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది, అవన్నీ కథలో ఇమిడిపోవడమే ఈ సినిమాకి ప్రధాన బలంగా మారింది. కథనంలోని లోతు, ప్రతి పాత్ర ప్రాముఖ్యత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. “ఫియర్” చిత్రబృందం అందించిన ఈ కథ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.దర్శకురాలు డా. హరిత “ఫియర్” ద్వారా టైటిల్‌కే తగ్గ కథను మలిచారు. వేదిక తన నటనతో పాత్రలకు న్యాయం చేసింది. రివర్స్ ఫ్లాష్‌బ్యాక్ ఫార్మెట్ ఆసక్తి రేకెత్తించగా సెకండాఫ్‌లో భయానికి కీలక ముగింపు ఇచ్చి, సీక్వెల్ సూచనతో మరో సస్పెన్స్‌ను కొనసాగించారు.

రేటింగ్ : 3.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *