Naga Chaitanya: సమంతకి అక్కడే ఎండ్ కార్డు..శోభితతో తొలి పరిచయం.. చైతూ కామెంట్స్ వైరల్.?

Naga Chaitanya: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని ఫ్యామిలీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అక్కినేని అఖిల్, అక్కినేని నాగచైతన్య పెళ్లిళ్ల విషయం బయటకు రావడంతో ప్రతి ఒక్కరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇదే తరుణంలో నాగచైతన్య తన లవ్ కు సంబంధించినటువంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు.. ఇంతకీ ఆయన ఏమన్నారయ్యా అంటే..
First contact with Sobhita Naga Chaitanya comments viral
నా ఓటీటీ షో విడుదల చేయడం కోసం నేను ముంబైకి వెళ్లాను. అదే టైంలో అదే ప్లాట్ ఫామ్ పై శోభిత కూడా ఒక షో చేయడానికి వచ్చింది. ఆ ప్లేస్ లోనే మేమిద్దరం మొదటిసారి కలిశాం. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాం. శోభిత నాతో చాలా బాగా మాట్లాడింది. మా కుటుంబం గురించి కూడా ఆమె అన్ని విషయాలు చెప్పింది. తర్వాత మా ఇద్దరి మధ్య అలా పెరిగిన స్నేహం చివరికి ప్రేమగా మారింది. శోభిత వారి కుటుంబానికి కూడా నన్ను పరిచయం చేసింది.(Naga Chaitanya)
Also Read:Nagarjuna: నయనతార పరువు తీసిన నాగార్జున.. అంత చీప్ క్యారెక్టర్ కాదు అంటూ.?
అలా శోభిత ఫ్యామిలీ కూడా నన్ను వారి కొడుకులా చూసుకున్నారు. మా ఇద్దరి మధ్య కొనసాగిన బంధం చివరికి పెళ్లి వరకు వెళ్లడంతో ఇరు కుటుంబాలను ఒప్పించుకొని పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. నన్ను శోభిత కుటుంబం ఒక కొడుకులా చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని, అంతే కాదు మా రెండు కుటుంబాలల్లో కామన్ క్వాలిటీస్ ఉన్నాయని, ఆమె ఒక ఫ్యామిలీ గర్ల్ అంటూ చెప్పుకొచ్చారు.

అంతేకాదు మా పెళ్లి కూడా సాంప్రదాయపరంగా నాకు ఎంతో ఇష్టమైనటువంటి అన్నపూర్ణ స్టూడియోలో అతి తక్కువ అతిథులతో అంగరంగ వైభవంగా జరగబోతుందని చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని నాగచైతన్య బయట పెట్టడంతో ఇక అన్నపూర్ణ స్టూడియో వేదికగానే డిసెంబర్ 4న సమంతాకు ఎండ్ కార్డు పడబోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Naga Chaitanya)