Winter Tips: చలికాలంలో చాలామంది దగ్గు సమస్యతో బాధపడతారు. ఈ సమస్యను తగ్గించడానికి చాలామంది మందులు ఎన్నో వాడతారు. అయినా కొంతమందికి ఎలాంటివి వాడినా కూడా ఫలితం ఉండదు. అలాంటివారు తులసి ఆకులను వేడి నీటిలో మరిగించి తీసుకున్నట్లయితే ఉపశమనం లభిస్తుంది. నల్లమిరియాలను గోరువెచ్చని నీటిలో వేడి చేసుకుని తాగినా కూడా దగ్గు సమస్య సులభంగా తగ్గుతుంది. Winter Tips

Follow these tips to avoid cough and cold in winter

ఈ నీరు తాగడం వల్ల సులభంగా దగ్గు సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం టీ లేదా అల్లం వేడి నీటిలో వేసుకొని తాగినట్లయితే దగ్గు సమస్య తగ్గుతుంది. తేనే కూడా దగ్గు సమస్యను సులభంగా దూరం చేస్తుంది. రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగినట్లయితే దగ్గు సమస్య సులభంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు సమస్య మరి ఎక్కువగా ఉన్నట్లయితే పాలు, పసుపును కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు సమస్యలు దూరం అవుతాయి. Winter Tips

Also Read: KCR: కొడంగల్ కు ఉద్యమ నేత కేసీఆర్?

ఉదయం లేచిన వెంటనే పాలు, పసుపు కలిపి తీసుకున్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టడం ద్వారా కూడా దగ్గు సమస్యకు చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో పసుపు వేసుకొని ఆవిరి పెట్టుకుంటే ఫలితం చాలా బాగుంటుంది. మసాలా టీ కూడా దగ్గును తగ్గిస్తుంది. టీలో చిటికెడు దాల్చిన చెక్క, పొడి అల్లం, లవంగాలను వేసుకొని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య తగ్గుతుందని నిపుణులు సూచనలు చేస్తున్నారు. Winter Tips