Deepika Padukone : దీపికా పదుకొనేతో నాలుగో పెళ్లి.. స్టార్ హీరో సంచలన కామెంట్స్.?
Deepika Padukone: బాలీవుడ్ హీరోయిన్లలో దీపికా పదుకొనే అంటే ఎంతటి పేరు ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ పై ఓ సీనియర్ స్టార్ హీరో బోల్డ్ కామెంట్లు చేశాడు. ఒకవేళ తనకు చిన్న వయసు ఉంటే దీపికాను ఆ విధంగా చేసుకునే వాడినని చెప్పాడు. మరి ఆ హీరో ఎవరు? ఆయన ఎందుకలా అన్నారు వివరాలు చూద్దాం..
Fourth marriage with Deepika Padukone
బాలీవుడ్ ఇండస్ట్రీలో బోల్డ్ కామెంట్స్ చేసే నటుల్లో ఖల్ నాయక్ సంజయ్ దత్ ఒకరు.. ఆయన అప్పుడప్పుడు కుళ్ళు జోకులు వేస్తూ ఉంటాడు.. అంతేకాదు ఎవరికి భయపడకుండా బోల్డ్ కామెంట్లు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి హీరో ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ తను చిన్నవాడినైతే నటి దీపిక పదుకొనే నాలుగవ వివాహం చేసుకునే వాడినని చెప్పుకొచ్చారు.. (Deepika Padukone)
Also Read: Charan-Pawan: పాపం.. చరణ్ పవన్ లకి జనవరి 10 భయం పట్టుకుందా..?
ఒకప్పుడు సంజయ్ దత్ దీపికా పదుకొనేను చాలా ప్రశంసించారు. తన అందాన్ని పొగిడారు. ఖల్నాయక్ చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చోళీ కే పీచే’ ఈ రోజుల్లో చిత్రీకరిస్తే దానిలో మాధురి దీక్షిత్ కాకుండా దీపికా పదుకొనేకు అవకాశం వచ్చేదని అన్నారు. తన అందం ఆటిట్యూడ్ పై కామెంట్స్ చేశారు. తనకు చిన్న వయసు ఉంటే ఆమె తన నాలుగో భార్య అయ్యేదాని వ్యాఖ్యానించారు.
ఈ విధంగా ఆయన కామెంట్లు చేయడంతో ఇంత వయసు వచ్చిన నీకు సిగ్గు లేదా, బహిరంగంగానే ఇంత బోల్డ్ గా మాట్లాడితే, ఒకవేళ ఏకాంతంగా దొరికితే వారిని ఏ విధంగా చూస్తావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీపిక పదుకొనే రన్వీర్ సింగ్ 2018లో వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈ జంటకు ఒక పాప కూడా జన్మించింది.(Deepika Padukone)