Chiranjeevi: “చంటబ్బాయ్” మూవీలో మీసం తియ్యడానికి చిరంజీవి పెట్టిన ఫన్నీ కండిషన్.. తెలిస్తే నవ్వేస్తారు.?
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. కానీ వారందరిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హీరో మెగాస్టార్ చిరంజీవి అని చెప్పవచ్చు.. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో చేయని పాత్రలేదు. చివరికి లేడీ గెటప్ లో కూడా చేసి అంటే ఏంటో నిరూపించుకున్నాడు.. ఆయన తాజాగా లైలా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడితూ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు..

Funny condition given by Chiranjeevi to Chantabbai movie
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పట్లో జంధ్యాల డైరెక్షన్ లో చంటబ్బాయి అనే సినిమా నేను చేశాను.. సినిమా అప్పట్లో మంచి హిట్ అవ్వడమే కాకుండా చిన్న పిల్లలకు బాగా నచ్చింది. అయితే ఈ సినిమా చేసే సమయంలో నేను పూర్తిగా లేడీ గెటప్ లో నటించానని చెప్పారు.. లేడీ గెటప్ చేయడం కోసం ఆయన చేసిన కొన్ని పనుల గురించి బయటపెట్టారు..(Chiranjeevi)
Also Read: Allu Arjun future movies: బడా ప్రాజెక్ట్ కు ఒకే చెప్పిన అల్లు అర్జున్.. అట్లీ అయితే కాదు!!
అయితే ఇందులో ఒక పాట కోసం పూర్తిగా లేడీ గెటప్ లోనే ఉండాల్సి వచ్చిందని ఆయన అన్నారు.. ఈ పాట గురించి జంధ్యాల నాకు అన్ని ముందుగానే వివరించి మీసం తీసేయాల్సి ఉంటుందని చెప్పారు.. దీంతో నేను ఒక కండిషన్ పెట్టాను.. మీరంతా మీసం తీసేస్తే నేను కూడా మీసం తీసేస్తానని చెప్పాను.. దీంతో చిత్ర యూనిట్ వారంతా మీసం తీసేసి నా ముందు కనిపించడంతో నేను కూడా మీసం తీసేసి ఆ పాటలో యాక్టింగ్ చేశాను.

ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా తన టాలెంట్ ఏంటో అందరికీ తెలిసింది.. ఇక ఈ విషయాన్ని తాజాగా లైలా సినిమా రిలీజ్ ఫంక్షన్ లో ఆయన బయటపెట్టారు.. నేను మీసం తీసేసిన తర్వాత మా ఇంటికి వెళ్తే మీసం పెంచే వరకు నువ్వు కనపడవద్దని నా కుటుంబం నన్ను దూరంగా ఉంచిందని చిరంజీవి నవ్వుకుంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..(Chiranjeevi)