Game Changer: “గేమ్ ఛేంజర్” బ్యాన్.. కన్నడ ప్రేక్షకులు ఆగ్రహం.. కారణం..?

Game Changer: భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు మరికొద్ది రోజులు ఉంది అనగా కొన్ని కొన్ని ప్రాంతాలలో ఆ సినిమాలకు భారీ షాక్ తగులుతూ ఉంటాయి. అయితే తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి కూడా కర్ణాటకలో పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలో గేమ్ ఛేంజర్ మూవీని బ్యాన్ చేయాలని అక్కడ వాళ్ళు గేమ్ ఛేంజర్ సినిమా పోస్టర్లపై బ్లాక్ పెయింట్ వేస్తూ నిరసన తెలుపుతున్నారు.

Game Changer ban Reason

Game Changer ban Reason

బాయ్ కట్ గేమ్ చేంజర్ అంటూ కర్ణాటకలో ఉన్న కన్నడ వాళ్ళు గేమ్ చేంజర్ మూవీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే కన్నడ ప్రేక్షకులు గేమ్ ఛేంజర్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కర్ణాటకలో ఎలాంటి ప్రమోషన్స్ చేయకుండానే తెలుగులోనే గేమ్ చేంజర్ సినిమాని విడుదల చేస్తున్నట్టు పోస్టర్స్ రిలీజ్ చేయడంతో అక్కడి ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.(Game Changer)

Also Read: Game Changer: పుష్ప2 ఎఫ్ఫెక్ట్..ఇక ఏ సినిమా ఈవెంట్ అయినా పోలీసుల జోక్యం తప్పనిసరి!!

కర్ణాటకలో ఒక్కసారి కూడా ప్రమోషన్స్ చేయకుండా గేమ్ ఛేంజర్ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారు..కన్నడలో ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా తెలుగులోనే కర్ణాటకలో కూడా తెలుగులో విడుదల చేయడం ఏంటి అని అక్కడి వాళ్ళు ఫైర్ అవుతున్నారు.

Game Changer ban Reason

అంతేకాదు ఈ సినిమాని మమ్మల్ని కాదని రిలీజ్ చేస్తే పరిణామాలు వేరేలా ఉంటాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ గొడవంతా జరిగిన కొద్దిసేపటికే నిర్మాత దిల్ రాజు మలయాళం అలాగే కన్నడలో గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. దీంతో అక్కడి వాళ్ళు కాస్త ఆగ్రహం తగ్గించుకున్నట్టు తెలుస్తోంది.(Game Changer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *