Game Changer: గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. నా ఉసురు తగిలింది..?
Game Changer: ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అవ్వడంతో చాలామంది మెగా ఫ్యామిలీ అంటే పడని యాంటి ఫ్యాన్స్ కి ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. ఎందుకంటే సినిమా డిజాస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ కి సంబంధించి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎన్ని అసభ్యకర పోస్టులు పెట్టారో చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ అంటే గిట్టని వాళ్ళు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మోత మోగించారు.

Game Changer Disaster
మెగా ఫ్యామిలీ పేరు మాత్రం ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయింది. నాకు అన్యాయం చేశారు అంటూ తాజాగా ఓ నటుడు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరయ్యా అంటే కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం.. శంకర్ దర్శకత్వం చేసిన గేమ్ ఛేంజర్ సినిమాలో బ్రహ్మా ఆనందం ని ఫుల్ లెన్త్ పాత్ర కోసం తీసుకున్నారట.(Game Changer)
Also Read: Balakrishna: ఫంక్షన్ కి పిలిచి ఆ హీరోని గేటు బయటే నిలబెట్టిన బాలకృష్ణ.?
కానీ తీరా సినిమా చూసేసరికి కేవలం కొద్ది వరకు మాత్రమే బ్రహ్మనందాన్ని ఉంచేశారట. బ్రహ్మానందం నటించిన మిగతా సన్నివేశాలు అన్నీ కూడా ఎడిటింగ్ లో తీసేసారంటూ రీసెంట్గా బ్రహ్మానందం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఈ సినిమాలో నా సన్నివేశాలు అన్ని తొలగించి నాకు అన్యాయమే చేశారు.. అంటూ బ్రహ్మానందం చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారడంతో చాలామంది నెటిజన్స్ బ్రహ్మానందం చేసిన అన్యాయానికి గేమ్ చేంజర్ కి ఆయన ఉసురు తగిలి డిజాస్టర్ అయింది అంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

కానీ బ్రహ్మానందం మాట్లాడిన తీరు వేరు సోషల్ మీడియాలో నేటిజన్స్ పెడుతున్న కామెంట్లు వేరు.. అలాగే గేమ్ ఛేంజర్ లో తన సీన్స్ తీసేసారని అసహనం వ్యక్తం చేశారు.కానీ ఎక్కడా కూడా గేమ్ చేంజర్ రిజల్ట్ గురించి అంతగా స్పందించలేదు.ఇక రీసెంట్ గా బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి నటించిన బ్రహ్మా ఆనందం సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.(Game Changer)