Game Changer: గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. చెప్పుతో కొడతా నా కొడకా అంటూ డిస్ట్రిబ్యూటర్ ఫైర్.?

Game changer: గేమ్ ఛేంజర్ మూవీపై సోషల్ మీడియాలో ఎంత నెగటివ్ ప్రచారం జరుగుతుందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమా పెద్ద ప్లాఫ్ అని అసలు డైరెక్టర్ శంకర్ ఎలా తెరకెక్కించారో తెలియడం లేదని, ఈ సినిమాలో లాజిక్ లేని సీన్స్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం అవ్వడం లేదు అంటూ సినిమా చూసిన చాలామంది నెగటివ్ రివ్యూలు ఇస్తున్నారు.

Game changer disaster Distributor Fire

Game changer disaster Distributor Fire

ఇక కొంతమంది అయితే సినిమా చూడకుండా కూడా ఏదో సినిమా చూసినట్టు మిగతావారు ఇచ్చిన రివ్యూలకు ఇంకాస్త జోడించి కాస్త ఘాటుగా రివ్యూ ఇస్తూ సినిమా చూడాలనే ఆలోచన ఉన్న ప్రేక్షకులకు కూడా ఆలోచనని చంపేస్తున్నారు.సినిమా సోషల్ మీడియాలో పెద్ద డిజాస్టర్ గా మారిపోయింది.ఇక సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా కూడా సినిమా పైన నెగటివ్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. (Game changer)

Also Read: Game Changer First Day Collections: అఫీషియల్..గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్.?

అయితే తాజాగా గత రెండు రోజుల క్రితం ఎక్స్ లో జరిగిన వార్ కి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే గేమ్ చేంజర్ డిజాస్టర్ అనే విషయం తెలిసి గుంటూరులోని ఓ డిస్ట్రిబ్యూటర్ హై బీపీ వచ్చి హాస్పిటల్ లో చేరారు అంటూ ఎక్స్ వేదికగా ఒక పోస్టు వైరల్ అయింది. అయితే ఈ పోస్టు ఎక్కువ వైరల్ అవ్వడంతో అది గుంటూరులోని సదరు డిస్ట్రిబ్యూటర్ కి కూడా చేరింది.

Game changer disaster Distributor Fire

దాంతో ఆ డిస్ట్రిబ్యూటర్ వెంటనే స్పందించి ఎవర్రా ఈ మాటలు మాట్లాడింది.. ఈ ట్వీట్ చేసింది.. డిజాస్టర్ అని అన్న వాడిని చెప్పుతో కొడతా నా కొడకా.. పిచ్చివాగుడు వాగితే తాటతీస్తా అంటూ ఫైర్ అయ్యారట. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొట్టడంతో గేమ్ చేంజర్ పై నెగిటివ్ ప్రచారం చేసేవారికి ఈ డిస్ట్రిబ్యూటర్ గట్టి కౌంటర్ ఇచ్చాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Game changer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *