Game Changer: పుష్ప-2 పోలిస్తే గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు అంత తక్కువా.. వెరీ బ్యాడ్.?
Game Changer: రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత గ్లోబల్ హీరోగా మారిపోవడంతో ఆయన రేంజ్ మరింత పెరిగింది. దీంతో ఆయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాకి ఒప్పుకున్నారు. అయితే ఈ సినిమా భారీ అంచనాలతో రావడంతో సినిమాకి నిర్మాతగా చేసిన దిల్ రాజు కూడా బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టారు. ఇక ఈ సినిమాలో ఉన్న పాటల కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు పెట్టారంటే సినిమా ఏ లెవెల్ లో తెరకెక్కించారో చెప్పుకోవచ్చు.
Game Changer First Day Collections So Low
ఇక ఈ సినిమాలో ఉన్న పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో ఉంటాయని ఇప్పటికే డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అలా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజర్ మూవీకి బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే సినిమా చూసిన ప్రేక్షకులు నెగటివ్ రివ్యూ ఇస్తున్నారు.డిజాస్టర్ గేమ్ చేజర్ అంటూ ఎక్స్ వేదికగా యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఈ నెగటివ్ రివ్యూ చూసి సినిమా చూడడానికి ఆసక్తిగా ఉన్న జనాలు కూడా సినిమా బాలేదని వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండిపోతారు. (Game Changer)
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ లోని నటినటుల రెమ్యూనరేషన్.. చరణ్ కి అంత తక్కువా..?
అయితే తాజాగా విడుదలైన గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు చాలా దారుణంగా ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్లను హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ బయటపెట్టింది. గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్షన్లు కేవలం 47.13 కోట్లేనని,రెండు తెలుగు రాష్ట్రాల్లో 38 కోట్లు రాగా తమిళంలో రెండు కోట్లు హిందీలో ఏడు కోట్లు మాత్రమే కలెక్షన్లు వసూలు చేసినట్టు రాసుకోచ్చారు. దీంతో ఈ న్యూస్ చూసి చాలామంది షాక్ అయిపోతున్నారు.
గేమ్ చేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ మరి అంత తక్కువా అని నోరెళ్ళబెడుతున్నారు. మరి చిత్ర యూనిట్ బయట పెట్టే ఆఫిషియల్ లెక్కల్లో ఈ సినిమాకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్లు ఏ విధంగా రివిల్ చేస్తారో చూడాలి. ఒకవేళ హిందుస్థాన్ టైమ్స్ న్యూస్ వాళ్ళు చెప్పింది నిజమైతే మాత్రం గేమ్ చేంజర్ కి పెద్ద బొక్కే అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లకు సంబంధించిన న్యూస్ లో పుష్ప-2తో పోలిస్తే గేమ్ చేంజర్ కలెక్షన్లు ఎంత తక్కువో అర్థం చేసుకోవచ్చు.(Game Changer)