Chiranjeevi: గేమ్ ఛేంజర్ ఫ్లాప్.. పుష్ప-2 బ్లాక్ బస్టర్.. చిరంజీవి ఓర్వలేకపోతున్నాడా.?
Chiranjeevi: చిరంజీవి ఎంతో మృదుస్వభావి..కుళ్ళు కుతంత్రాలు లేని ఒక గొప్ప హీరో అని మరోసారి నిరూపించుకున్నారు.. తాజాగా ఆయన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి పలు ఆసక్తికరమై విషయాలను బయటపెట్టారు.. ఇక ఆయన మాటలు విన్న తర్వాత నీచ వార్తలు రాసే ఆకతాయిలా నోళ్ళు మూతపడ్డాయని చెప్పవచ్చు.. ఇంతకీ చిరంజీవి ఏమన్నారు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మెగా అల్లు ఫ్యామిలి నుంచి ఎంతోమంది హీరోలు ఉన్నారు.. ఇందులో రామ్ చరణ్ అల్లు అర్జున్ స్టార్ స్టేటస్ తెచ్చుకున్నారు..

Game changer flop Pushpa-2 blockbuster Chiranjeevi cannot stand it
ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినటువంటి పుష్ప -2 సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి అద్భుతమైన హిట్ సాధించింది.. అయితే చిత్ర యూనిట్ సంతోషపడేలోపే ఈ సినిమా వల్ల ఒక మహిళ చనిపోయి మరో వ్యక్తి తీవ్రంగా గాయపడడం అందరిని కలిచి వేసింది. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్లారు. అల్లు అర్జున్ జైలుకు వెళ్లడంతో నాగబాబు చిరంజీవి వెళ్లి పరామర్శించారు.. కానీ పుష్పటు సినిమా కలెక్షన్స్ మాత్రం దాదాపుగా 2000 కోట్ల దగ్గరికి వచ్చాయి. ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్టుగా ఈ చిత్రం నిలిచింది.. (Chiranjeevi)
Also Read: Sai Pallavi: సాయి పల్లవికి ఆ హీరో అంటే అంత పగా.. పేరు చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదా.?
ఇక ఈ మూవీ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సినిమా గేమ్ చేంజర్.. ఇందులో రామ్ చరణ్ హీరోగా చేశారు.. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది.. దీంతో కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ సినిమా హిట్ అయింది రామ్ చరణ్ సినిమా హిట్ కాలేదని చిరంజీవి దారుణంగా కుళ్ళు కుంటున్నారని,ఓర్వలేక పోతున్నారని కొందరు వార్తలు రాస్తూ వచ్చారు.. కట్ చేస్తే తాజాగా చిరంజీవి విశ్వక్సేన్ హీరోగా చేసిన లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు..

ఇండస్ట్రీలో మెగా కాంపౌండ్ అల్లు కాంపౌండు అంటూ ఏమీ ఉండదని, హీరోలంతా ఒక్కటే అని, ఏ హీరో సినిమా హిట్ అయిన అందరం ఆనందంగా ఉంటామని చెప్పుకొచ్చారు.. మనందరం సినిమా కుటుంబమే తప్ప ఆ కుటుంబం ఈ కుటుంబం అంటూ ఏమీ లేదని తెలియజేశారు. పుష్ప టు హిట్ అవడంతో నేను గర్వపడుతున్నానని అన్నారు.. ఈ విధంగా చిరంజీవి తన మనసులోని మాటలను బయట పెట్టడంతో, వారి కుటుంబాల మధ్య చిచ్చు పుట్టించే కొంతమంది ఆకతాయిల నోళ్లు మూసుకున్నట్టు అయిపోయింది.. ప్రస్తుతం చిరంజీవి మాటలు విన్న నేటిజన్స్ ఆయనకు సపోర్టుగా నిలుస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Chiranjeevi)