Game Changer: గేమ్ ఛేంజర్ ఆ స్టార్ హీరో సినిమాకి కాపీ.. సినీ క్రిటిక్ షాకింగ్ కామెంట్స్!
Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవికి ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఆయన నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చి గ్లోబల్ స్టార్ అయ్యారు. అలాంటి రాంచరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీని ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు.
Game Changer is a copy of that star hero movie
అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే పలు వివాదాలను ఎదుర్కొంటుంది.. ఈ సినిమాను తమిళనాడులో విడుదల చేయకూడదని లైకా ప్రొడక్షన్ ఇటీవల వాగ్వాదం చేసింది. శంకర్ తమ నిర్మాణంలో రూపొందుతున్న ఇండియన్ 2 షూటింగ్ పూర్తి చేయకుండా గేమ్ చేంజర్ సినిమాను పూర్తి చేసి తమిళనాడులో విడుదల చేయకూడదని లైకా గట్టిగా చెప్పడంతో కమలహాసన్ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించారు.(Game Changer)
Also Read: Suchitra: విశాల్ కి అలా అవ్వడం నాకు హ్యాపీ.. నా భర్త లేనప్పుడు రూమ్ కి వచ్చి.?
ఇక ఇది మరవక ఈ సినిమా అంతా కాపీ కొట్టారని సినీ విమర్శకుడు బ్లూ సటై మారన్ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విజయ్ కాంత్ నటించిన తెన్నావన్ సినిమా కాపీ అని ఆయన తెలియజేశారు. ముఖ్యంగా గేమ్ చేంజర్ కథ విషయానికి వస్తే నిజాయితీపరుడైన ఐఏఎస్ ఆఫీసర్ రామ్ చరణ్ అధికారంలోని రాజకీయ నాయకుడు విజయ్ సూర్య మధ్య జరిగే వాగ్వాదం గురించి ఉంటుందని తెలియజేశారు.
అలాగే తెన్నావన్ సినిమాలో కూడా నిజాయితీపరుడు ఎన్నికల కమిషనర్ మరియు తమిళనాడు ముఖ్యమంత్రి నాజర్ మధ్య జరిగే సంఘర్షణ గురించి ఉంటుందని తెలియజేశారు. ఈ చిత్రాన్ని కాపీ కొట్టి గేమ్ చేంజర్ తీశారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. మరి చూడాలి సంక్రాంతి బరిలో ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా ముందు ముందు తెలుస్తుంది.(Game Changer)