Game Changer movie: వంద అడ్డంకులు.. గేమ్ చేంజర్ ఈవెంట్స్ కి రేవంత్ బిగ్ షాక్!!
Game Changer movie: తెలుగులో మోస్ట్ అవైటెడ్ మూవీ అయిన గేమ్ చెంజర్ చిత్రానికి సంబంధించి, అభిమానులు భారీ ఆసక్తితో చూస్తున్నారు. రామ్ చరణ్ తేజ్ హీరో గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుండగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అన్ని ప్లాన్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ మరియు ఇతర కార్యక్రమాలు ఎలా చేయాలో భారీగా ప్లాన్ చేశారు. అయితే వీటిని ప్రభుత్వం బ్రేక్ వేశారనిపిస్తుంది. ఇప్పటికే అభిమానులు సినిమా యూనిట్ నుంచి ఈవెంట్స్ గురించి అధికారిక సమాచారం వస్తుందేమో అని ఎదురుచూస్తుండగా ఈ అంశాలపై మరింత వివరాలు ప్రకటించబడతాయని ఎదురుచూస్తున్నారు.
Game Changer movie facing promotional setbacks
సినిమాపై అభిమానుల ఉత్కంఠ పెరిగిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. గేమ్ చేంజర్ సినిమా ఈవెంట్స్ పై అన్ని వైపులా అభిమానుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా అందులోనూ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానులు భారీ ప్లాన్స్ వేశారు. మొదట్లో చిత్ర యూనిట్ వివిధ కార్యక్రమాలు నిర్వహించి, సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు.
ఈవెంట్‌లో నటుల performances మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఈవెంట్స్ లో మెగా ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, సినిమాపై పూర్తి వివరాలు మరింత వివరంగా ప్రకటించబడాలని అభిమానులు కోరారు. ఇటీవలే కాలంలో సినిమా సంబరాలు అంబరాన్నంటుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన మరియు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు, మెగా అభిమానుల దృష్టిలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ఇటీవలే పుష్ప సినిమా విషయంలో జరిగిన ఇష్యూ నేపథ్యంలో ఈ సినిమా కి కొన్ని తలనొప్పులు తెచ్చేలా ఉంది.
\ఈ సినిమా కి ఎక్కువ పెర్మిషన్స్ ఇవ్వొద్దని ప్రభుత్వం, పోలీసులు ఆలోచిస్తున్నారు. దీంతో అభిమానులు కొంత నిరుత్సాహపరుస్తున్నారు. చిత్ర యూనిట్ నుండి అధికారిక సమాచారం వచ్చేంత వరకు, సినిమా గురించిన విషయాలు, ప్రచార కార్యక్రమాలపై అభిమానులు వేచిఉండాలని చెప్తున్నారు. మరి గేమ్ చేంజర్ పై పుష్ప 2 ప్రభావం ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.