Game Changer: గేమ్ ఛేంజర్ ప్లస్ లు మైనస్ లు .. సినిమాలో ఆ ఒక్క సీనే కీలకమా.?
Game Changer: గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్ గేమ్ ఛేంజర్.. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరి నోటా గేమ్ ఛేంజర్ సినిమా మాటే వినిపిస్తోంది. ఈ సినిమా చూడడానికి ఇప్పటికే మెగా ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో బెనిఫిట్ షోస్ బుక్ చేసుకుని ఆల్రెడీ చూసేసారు.అయితే ఏపీలో ఉండే మెగా ఫ్యాన్స్ అదృష్టం ఉంది కానీ తెలంగాణలో ఉండే మెగా ఫ్యాన్స్ కి ఆ అదృష్టం లేదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన ఘటన కారణంగా తెలంగాణలో బెనిఫిట్ షోస్ బ్యాన్ చేసిన సంగతి వెనక్కి తెలిసిందే.
Game Changer Pluses and Minuses
తాజాగా విడుదలైన గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి సినిమా చూసిన జనాలు సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమా చూసిన కొంతమంది మిక్స్డ్ రివ్యూలు ఇస్తే మరి కొంత మంది బ్లాక్ బస్టర్ అంటున్నారు. ఇంకొంతమంది అట్టర్ ఫ్లాప్ అంటున్నారు.ఇలా ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఉన్న ప్లస్ లు,మైనస్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ఎన్నో ప్లస్ లు ఉన్నాయి.గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ నటించిన అప్పన్న పాత్ర సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. (Game Changer)
Also Read: Game Changer: ఈ బజ్ తో ‘గేమ్ ఛేంజర్’ పాన్ ఇండియా విజయం కష్టమే చెర్రీ!!
ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే అంజలి కూడా తన నటనతో ఆకట్టుకుంది.ఇక అంజలి నటనకి అయితే అవార్డులు ఇచ్చిన తక్కువే అని రివ్యూలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకి తమన్ బిజిఎం అద్భుతంగా ఇచ్చాడు. అలాగే రామ్ చరణ్ డాన్స్ కూడా ఈ సినిమాకే ప్లస్..ఇక ఈ సినిమాలో ఉన్న కీలకమైన సన్నివేశం ఫ్లాష్ బ్యాక్ లో వచ్చి 30 నిమిషాల సీన్..ఈ 30 నిమిషాల సీన్ సినిమాకి కీలకమని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలా సినిమాకి ప్లసులు బాగానే ఉన్నాయి. అలాగే మైనస్లు కూడా ఉన్నాయి.
సినిమా బాగున్నప్పటికీ కొత్తదనం ఏమీ చూపించలేదు అని డైరెక్టర్ శంకర్ పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.అలాగే సినిమాలో కామెడీ అంతగా పండలేదని, లవ్ స్టోరీ కూడా బాగాలేదని, అంతేకాకుండా సినిమాలో పొంతన లేని కొన్ని సన్నివేశాలు ఉండడం కూడా సినిమాకి మైనస్ అయ్యాయి.అలాగే బాలీవుడ్ నటి కియారా అద్వాని పాత్ర కూడా ఈ సినిమాలో అంతగా లేదు.అలాగే కియారా అద్వానీ పాత్రకి అంతా గుర్తింపు కూడా లేదని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అసలు హీరోయిన్ అంజలినే అన్నట్లుగా పాత్రలో ఒదిగిపోయి నటించింది.(Game Changer)