Garika: గరికరసం అంటేనే పారిపోతున్నారా..అయితే ఇవి తెలుసుకోండి ?
Garika: గరిక జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తల్లిపాల ఉత్పత్తిని పెంచడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. గరిక జ్యూస్ రోజు తాగడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. గరికలో శరీరానికి మేలు కలిగించే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఫైబర్, యాసిడ్, కొవ్వు, విటమిన్ సి, విటమిన్ ఏ, ఆల్కలాయిడ్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ కడుపుతో గరిక రసం తాగినట్లయితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.

Garika Grass Amazing Health Benefits
ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ జ్యూస్ మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది శరీరంలోని చెడు నీరు, కొవ్వును తొలగిస్తుంది. శరీరంలో ఏమైనా విష పదార్థాలు ఉన్నట్లయితే వాటిని తొలగిస్తుంది. గరిక జ్యూస్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గిస్తుంది. మెదడు, అజీర్ణం, కడుపు నొప్పి వ్యాధులు, ఉబ్బసం, వేడి వ్యాధులు అనేక రకాల సమస్యలను తొలగిస్తాయి. కిడ్నీలో రాళ్లను కరిగించడంలో గరిక జ్యూస్ ఎంతగానో సహాయం చేస్తుంది.
ప్రతిరోజు ఒక గ్లాసు గరిక రసం తాగినట్లయితే అలసట, తిమ్మిర్లు, రక్తహీనత వంటి సమస్యలు నయమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. చర్మ సమస్యలు, కళ్ళ సమస్యలు ఉన్నవారు గరికపోసలను పేస్ట్ చేసి అందులో కొంచెం పసుపు కలుపుకొని శరీరానికి పట్టించినట్లయితే సమస్యలు తొలగిపోతాయి.