Genelia: జెనీలియాకి భర్త టార్చర్.. సినిమాలు చేస్తానంటే అలా అన్నారా.?

Genelia: రింగుల జుట్టు సుందరి జెనీలియా అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ బొమ్మరిల్లు,శశిరేఖ పరిణయం, రెడీ, ఢీ వంటి ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించి నటిగా గుర్తింపు సంపాదించింది.అలా సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఈ హీరోయిన్ కి మంచి పేరుంది. ఇక నార్త్ ఇండస్ట్రీలో నటుడు రితేష్ దేశ్ ముఖ్ తో సినిమాలు చేసే సమయంలో ఆయనతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది.
Genelia husband is torture
పెళ్ళై ఇద్దరు కొడుకులు పుట్టాక సినిమాలకు దూరంగా ఉన్న జెనీలియా దాదాపు పది సంవత్సరాల తర్వాత వేద్ అనే మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది.అయితే వేద్ మూవీ తెలుగులో నాగచైతన్య సమంత జోడిగా వచ్చిన మజిలీ మూవీకి రీమేక్.అలా వేద్ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో జెనీలియాకి పర్ఫెక్ట్ రీ ఎంట్రీ..అయితే జెనీలియా తాజాగా ఓ ఈవెంట్లో తన రీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. పిల్లలు పెద్దయ్యాక నేను సినిమాల్లోకి రీ ఎంట్రి ఇద్దాము అనుకున్న సమయంలో తెలిసిన వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. (Genelia)
Also Read: Director: డైరెక్టర్ బాగోతం బట్టబయలు.. హోటల్ రూమ్ లో 5గురు హీరోయిన్లతో ఒకేసారి గడిపి..?
అంతే కాదు పది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ నీకు వర్కౌట్ అవ్వదు అని మొహం మీదే నిరాశ పడేలా చెప్పారు.దాంతో చాలా రోజులు సైలెంట్ గా ఉన్నాను.కానీ నా భర్త మాత్రం నాకు సపోర్ట్ ఇచ్చి రియంట్రీ కి సహకరించారు.అందుకే అన్ని విషయాల్లో ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు.సొంత నిర్ణయాలు తీసుకోవాలి అని అప్పుడే అనుకున్నాను అంటూ జెనీలియా చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం తెలియని కొంతమంది జెనీలియాని భర్త ఆమె రీ ఎంట్రీ ఇస్తానంటే వద్దని టార్చర్ చేస్తున్నారని,అందుకే ఇన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉంది అని రూమర్లు క్రియేట్ చేశారు. కానీ స్వయంగా జెనీలియా తన భర్త సపోర్ట్ చేశారని క్లారిటీ ఇవ్వడంతో ఈ రూమర్లకు తెరపడింది.(Genelia)