Post Office Scheme: చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని డబ్బులు దాచుకుంటూ ఉంటారు, దేశంలో ప్రజలకు పెట్టుబడులు పెట్టెందుకు చాలా ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ అలానే రియల్ ఎస్టేట్ వీటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించే స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ కూడా చాలా ఉన్నాయి. మిగతా వాటితో పోల్చుకుంటే స్మాల్ సేవింగ్స్ పథకాలలోనే ఎలాంటి రిస్క్ ఉండదు. ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ లో ఎన్నో పెట్టుబడిలో పథకాలు ఉన్నాయి. అయితే కొన్ని స్కీమ్స్ మాత్రమే జనాధారణ పొందుతున్నాయి. వాటిలోకి కిసాన్ వికాస్ పాత్ర ఒకటి.
Get Rs. 10 lakhs with Post Office Scheme
ప్రభుత్వ మద్దతుతో ఉండే ఈ స్కీం లో మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత తొమ్మిదేళ్ల 7 నెలల లోనే డబ్బులు రెట్టింపు అవుతాయి. అంటే ఇన్వెస్ట్ చేశాక 115 నెలల్లో డబ్బులు రెట్టింపు అవుతాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేటులను నిర్ణయించింది. ఈసారి కూడా వీటి వడ్డీ రేట్లు అదనంగా ఉంచినట్లు ప్రకటించారు. కిసాన్ వికాస్ పత్ర పథకం వడ్డీ రేట్లు మారలేదు. ప్రస్తుతం దీంట్లో 7.5% వడ్డీ వస్తుంది పెట్టుబడి పెట్టడానికి కనీసం 1000 నుండి ఇన్వెస్ట్ చేయొచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు.
Also read: Revanth Reddy: మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!
ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. సింగిల్ ఎకౌంట్ తీసుకోవచ్చు గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు. పదివేలు డిపాజిట్ చేసినట్లయితే సరిగా 115 నెలలకు 20,000 అవుతుంది. ఐదు లక్షల డిపాజిట్ చేస్తే అది పది లక్షలు అవుతుంది. 10 లక్షలు పెడితే 20 లక్షలు అవుతాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నిర్దిష్టకు ముందే అకౌంట్ మూసేయొచ్చు. అకౌంట్ హోల్డర్ మరణించిన సమయంలో సింగిల్ లేదా జాయింట్ హోల్డర్ మరణించిన ఇంకా కోర్టు ఆదేశించినా లేదా డిపాజిట్ తేదీ నుండి 6 నెలల తర్వాత రెండున్నర ఏళ్ళు తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే అకౌంట్ క్లోజ్ చేయొచ్చు (Post Office Scheme).