Gongadi Trisha: క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. ఎవరీ గొంగడి త్రిష ?
Gongadi Trisha: అండర్-19 మహిళా టి20 ప్రపంచకప్ లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్మెన్ గా భారత్ కు చెందిన జి. త్రిష రికార్డు సృష్టించింది. మంగళవారం స్కాట్లాండ్ లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్ లో 59 బంతుల్లో 110 పరుగుల ఇన్నింగ్స్ ఆడి నాటౌట్ గా నిలిచింది. అంతేకాదు మూడు వికెట్లు కూడా తీశారు. ఇంగ్లీష్ కామెంటేటర్ త్రిషను ఇండియన్ ప్లేయర్ అనకుండా భద్రాచలం అమ్మాయి అంటూ మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.
Gongadi Trisha cricketer Biography, Age, Height, Family,
గత ప్రపంచకప్ ను భారత్ గెలుచుకుంది. ఆ టీమ్ లో త్రిష కూడా ఉంది. కుమార్తె శిక్షణ కోసం తన జిమ్ తో పాటు నాలుగు ఎకరాల భూమిని విక్రయించాల్సి వచ్చిందని ఆమె తండ్రి చెప్పాడు. త్రిష 5 ఐసీసీ అండర్-19 మహిళల t20 ప్రపంచ కప్ లో చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ పేరు గొంగడి త్రిష. త్రిష తెలంగాణలోని భద్రాచలం నివాసి.
జనవరి 28న స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 19 ఏళ్ల గొంగడి త్రిష చేసిన సెంచరీ చరిత్ర సృష్టించింది. ఐసీసీ అండర్-19 మహిళల t20 ప్రపంచ కప్ చరిత్రలో త్రిష సెంచరీ చేసిన మొదటి బ్యాట్స్మెన్ గా నిలిచింది. త్రిష 59 బంతుల్లో 13 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 110 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడింది. స్కాట్లాండ్ పై సెంచరీ చేసిన తర్వాత త్రిష ఐసీసీ అండర్-19 మహిళల t20 ప్రపంచ కప్ ప్రస్తుత సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచింది.