AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త…2026 జూన్ నాటికి ఇండ్లు !
AP: పోలవరం బాధితులకు ఏపీ శుభవార్త చెప్పింది. 2026 జూన్ నాటికి పూర్తి చేసి గౌరవప్రదంగా వారికి ఇళ్ళు అప్పగిస్తామని ప్రకటించారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ మేరకు మండలిలో మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటన చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు గత అయిదేళ్ళలో ఒక్క రూపాయి నష్టపరిహారం గానీ, కాలనీల నిర్మాణానికి అరబస్తా సిమెంట్ పనులు కూడా చేయలేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. గత ఐదేళ్లు నిర్వాసితులను పట్టించుకోకపోవడంతో మమ్మల్ని తెలంగాణలో కలిపేయని నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.

Good news from AP for Polavaram victims
నాడు 2017లో 800 కోట్లు జమ చేసిన చంద్రబాబు, మరలా ఏడేళ్ళ తరువాత నిర్వాసితుల కష్టాలు తీర్చేలా నిర్వాసితులకు సంక్రాంతి కానుక అందించారని వెల్లడించారు. ఎటువంటి హాంగామా లేకుండానే, ఒకే విడతగా 800 కోట్లు నిర్వాసితుల ఖాతాల్లో జమ చేసింది కూటమి ప్రభుత్వం అని చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Kavati Manohar Naidu: వైసీపీకి షాక్…గుంటూరు నగర మేయర్ రాజీనామా ?
సిఎం అయ్యాక పోలవరం నిర్వాసితుల వైపు కన్నెత్తి కూడా చూడకపోగా, పునరావాస కాలనీల్లో ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదని వివరించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఇచ్చిన 3385 కోట్ల రియంబర్స్మెంట్ నిధులను కూడా, ప్రాజెక్టు నిర్మాణానికి గానీ, నిర్వాసితులకు గానీ, అందించకుండా దారిమళ్ళించి దోచుకున్న దుర్మార్గుడు జగన్ అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
Revanth Reddy: వాళ్ళను బట్టలు, గుడ్డలు ఊడతీసి కొడతా ?
పోలవరం ప్రాజెక్టును విధ్వంశం చేసినట్లే, నిర్వాసితులను సైతం నిలువునా ముంచేశాడు జగన్ అంటూ ఫైర్ అయ్యారు మంత్రి నిమ్మల రామానాయుడు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, నిర్వాసితులకు నష్టపరిహారం,పునరావాస కాలనీల నిర్మాణానికి అంతే ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. పునరావాస కాలనీల నిర్మాణ పనులు వేగంవంతం చేసి, 2026 జూన్ నాటికి పూర్తి చేసి గౌరవప్రదంగా వారికి ఇళ్ళు అప్పగిస్తామని వెల్లడించారు.