BRS: గూడెం మహిపాల్ రెడ్డి యూ టర్న్.. KCR స్కెచ్ అదుర్స్ ?
BRS: గులాబీ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలందరూ యూటర్న్ అవుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పై రోజురోజుకు తీవ్ర వ్యతిరేకత పెరుగుతోందని భావిస్తున్న పదిమంది రెబల్ ఎమ్మెల్యేలు… మళ్లీ గులాబీ గూటికి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఇందులో భాగంగానే ఇప్పటికే పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. కెసిఆర్ టచ్ లోకి వెళ్లారట.

Goodem Mahipal Reddy U Turn KCR Sketch Adurs
తనను మళ్ళీ పార్టీలో చేర్చుకోవాలని ఈ సందర్భంగా కేసీఆర్ను గూడెం మహిపాల్ రెడ్డి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా సంస్థలు కూడా ఇదే వార్త రావడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజున గూడెం మహిపాల్ రెడ్డి..
మళ్లీ గులాబీ గూటికి రాబోతున్నారట. ఆయనతో పాటు మరో ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారని అంటున్నారు. మరి దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.