Green Apple: గ్రీన్ ఆపిల్ తినడానికి ముందు ఈ విషయాలు తెలుసుకోండి ?
Green Apple: చాలా మంది మార్కెట్ లో దొరికే రెడ్ ఆపిల్ మాత్రమే తింటారు. గ్రీన్ యాపిల్ తినడానికి ఎవరూ పెద్దగా ఆసక్తిని చూపించారు. కానీ గ్రీన్ ఆపిల్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ ఆపిల్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. దానివల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఎముకల బలహీనతతో బాధపడేవారు గ్రీన్ ఆపిల్ తప్పకుండా తినాలి.
Green Apple Benefits
వీటిలో అధికంగా పోషకాలు ఉండడం వల్ల కాలేయాన్ని బలంగా తయారు చేస్తాయి. ఇందులో ఆంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. గ్రీన్ ఆపిల్ తినడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వీటిని తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
గ్రీన్ ఆపిల్ లో ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ ఉంటాయి. అందువల్ల గ్రీన్ ఆపిల్ తినడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. గ్రీన్ యాపిల్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇవి కంటికి మేలు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రీన్ ఆపిల్ ప్రతి రోజు తినడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శ్వాస సమస్యలు కూడా తొలగిపోతాయి. శ్వాస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.