Green Chillies: పచ్చి మిర్చి, రెడ్ మిర్చి ఏది తినాలి ?
Green Chillies: కూర, చారుల్లో ఒకటి రెండు మిర్చి వేసినట్లయితే చక్కటి రుచి, పరిమళం చాలా బాగుంటాయి. రోటి పచ్చడి చేస్తే నోరు ఊరాల్సిందే. ఇక మిర్చి బజ్జి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రుచి సంగతి పక్కన పెడితే మిర్చి ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాన్ని తరిమి వేస్తుంది. మనసును హాయిగా ఉంచుతాయి. మిర్చి పరిమళం, రుచికి నోటికి చాలా బాగుంటాయి. మిర్చి తిన్నట్లయితే జీర్ణ ప్రక్రియ బాగుంటుంది.

Green chillies and red chillies which should be eaten
చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. అందుకే దీనిని భారతీయ వంటకాలలో తప్పకుండా ఉపయోగిస్తారు. అయితే పచ్చిమిర్చి, ఎర్ర మిర్చి రెండు రకాల మిరపకాయలు లభ్యమవుతాయి. వీటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనకరమో చాలా మందికి తెలియదు. నిజానికి పచ్చి, ఎర్ర మిర్చీల మధ్య పోలిక ఉంటుంది. ఈ రెండింటిని తినడం వల్ల వేరువేరు ప్రయోజనాలు అందుతాయి. పచ్చిమిర్చిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
ఎర్ర మిర్చీని సంవత్సరం పాటు తిన్నట్లయితే క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే అల్సర్, ఆసిడిటీ సమస్యలు ఉన్నవారు మిరపకాయలు అస్సలు తినకూడదు. అలాగే మిర్చి తినడం వల్ల ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. మిరపకాయలు ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. ఇది కడుపులోని పేగుల పొరను దెబ్బతిస్తుంది. దానివల్ల అల్సర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే మిర్చి ఎక్కువగా తినడం వల్ల దగ్గు, గొంతు, నొప్పి వస్తుంది. ఏదైనా అధికంగా తినడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి పచ్చిమిర్చిని సరైన పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.