GV Prakash: ఆ హీరోయిన్ తో జీవి ప్రకాష్ ఎఫైర్..భార్యని తెలివిగా వదిలించుకున్నాడా.?
GV Prakash: సెలబ్రెటీల విడాకులు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అయితే చిన్న చిన్న కారణాలకి విడాకులు తీసుకుంటూ కొంతమంది మొహం చూసుకోనంత పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతే మరికొంతమందేమో ఫ్రెండ్స్ గానే విడిపోతున్నారు.అయితే గత ఏడాది విడాకులు తీసుకున్న లిస్టులో మ్యూజిక్ డైరెక్టర్ హీరో అయినటువంటి జీవి ప్రకాష్ కుమార్ అలాగే సైంధవిలు ఉన్నారు.

GV Prakash affair with that heroine
అయితే వీరిద్దరూ ఎంతో బాగా కలిసి ఉండేవారు. కానీ సడన్గా విడాకులు అనౌన్స్ చేయడంతో చాలా మంది షాక్ అయిపోయారు.అయితే వీరి విడాకులకు కారణం ఎన్నో రూమర్లు వినిపించినప్పటికీ ఓ హీరోయిన్ తో జీవి ప్రకాష్ కి ఎఫైర్ ఉంది అనే వార్త మాత్రం బలంగా వినిపించింది.అయితే ఆ రూమర్ మరోసారి వినిపిస్తోంది. దానికి ప్రధాన కారణం జీవి ప్రకాష్ ఎఫైర్ పెట్టుకున్నాడు అని రూమర్స్ వచ్చిన హీరోయిన్ తోనే మళ్లీ సినిమా చేయడం..(GV Prakash)
Also Read: Vijay Deverakonda: బాలీవుడ్‌లో పంబ రేపబోతున్న విజయ్ దేవరకొండ.. ఆ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో సినిమా?
జీవి ప్రకాష్ దివ్యభారతి గతంలో ఓ సినిమా చేశారు. అయితే వీరి విడాకులు జరిగిన సమయంలో దివ్యభారతి పేరే గట్టిగా వినిపించింది. కానీ ఆ విషయం పట్టించుకోకుండా మళ్ళీ దివ్యభారతితోనే కింగ్ స్టన్ అనే సినిమాని జీవి ప్రకాష్ చేశారు. దీంతో మరోసారి విడాకుల వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దివ్యభారతి కోసమే భార్యను తెలివిగా వదిలించుకున్నాడు అంటూ జీవి ప్రకాష్ పై రూమర్లు వచ్చాయి.

కానీ ఈ రూమర్లపై జీవి ప్రకాష్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివ్యభారతి నేను జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. మేమిద్దరం షూటింగ్ సెట్లో మాత్రమే కలుసుకుంటాం. బయట ఎక్కడా కూడా కలుసుకోం.మా ఇద్దరి మధ్య మీరు అనుకుంటున్న బంధం అయితే లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక జీవి ప్రకాష్ ఎన్నిసార్లు తమ మధ్య ఏమీ లేదని చెప్పినా కూడా ఈ రూమర్లు మాత్రం ఆగడం లేదు.(GV Prakash)