GV Reddy Resigns: కూటమిలో ముసలం… జీవి రెడ్డి రాజీనామా ?
GV Reddy Resigns: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో… ఓ కీలక వ్యక్తి రాజీనామా చేశారు. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి జీవి రెడ్డి తాజాగా రాజీనామా చేయడం జరిగింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవితో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా… జీవి రెడ్డి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో… తెలుగుదేశం పార్టీతో పాటు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు… జీవి రెడ్డి తాజాగా ప్రకటించారు.

GV Reddy Resigned to TDP Party
ఇక పై న్యాయవాద వృత్తిలో మాత్రమే కొనసాగుతానని… క్లారిటీ ఇచ్చారు ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి. లాయర్ గా పనిచేస్తాను కానీ భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలో కూడా చేరబోనని… స్పష్టం చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినట్లు స్పష్టం చేశారు.
అయితే గత కొన్ని రోజుల కిందట ఏపీ ఫైబర్ నెట్ లో ఓ ఐఏఎస్ అధికారి అవినీతి చేశాడని… జీవి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో జీవి రెడ్డిని సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా తిట్టారట. ఫోన్ చేసి క్లాస్ పీకారట. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్ పదవి అలాగే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు జీవీ రెడ్డి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.