Keerthy Suresh: హన్సికకి కీర్తి సురేష్ కాబోయే భర్తకి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్..?
Keerthy Suresh: ఏంటి కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్ కి హీరోయిన్ హన్సిక కి మధ్య రిలేషన్ ఉందా..అసలు వీరిద్దరికీ పరిచయం ఎక్కడిది..బంధుత్వమా..లేక ఫ్రెండ్షిప్పా.. ఇంతకీ వీరి మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..డిసెంబర్ 12న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్న కీర్తి సురేష్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.
Hansika secret relationship with Keerthy Suresh fiance
ప్రస్తుతం ఎక్కడ చూసినా కీర్తి సురేష్ రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోవడం, ఆమె బట్టలు, నగలు ఇలా ఎన్నో మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే ఆంటోనీ తట్టిల్ దుబాయ్ లో పెద్ద బిజినెస్ మాన్ అనే సంగతి మనకు తెలిసిందే.. అయితే అలాంటి ఆంటోనీ తట్టిల్ కి హన్సికకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటయ్యా అంటే..(Keerthy Suresh)
Also Read: Sandeep Raj : హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న నేషనల్ అవార్డు దర్శకుడు!!
హన్సిక పెళ్లి చేసుకున్న సోహెల్ కతురియా అందరికీ తెలుసు. ఈయన కూడా ఓ టాప్ బిజినెస్ మాన్.. అలా హన్సిక భర్త సోహెల్ కతూరియాకి కీర్తి సురేష్ కి కాబోయే భర్త ఆంటోనీ తట్టిల్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందట.వీరిద్దరూ బిజినెస్ లో స్నేహితులు కావడంతో హన్సిక కి కూడా ఆంటోని తట్టిల్ తో ఫ్రెండ్షిప్ ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది కాస్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.మరి నిజంగానే వీరిద్దరి మధ్య స్నేహం ఉందా లేక సోషల్ మీడియాలో వినిపించే రూమరేనా అనేది తెలియాలంటే కీర్తి సురేష్ పెళ్లి జరిగే వరకు ఆగాలి. ఎందుకంటే కీర్తి సురేష్ పెళ్లికి హన్సిక తన భర్తతో కలిసి వస్తే నిజంగానే వారి మధ్య ఫ్రెండ్షిప్ ఉందని అర్థం చేసుకోవచ్చు.(Keerthy Suresh)