Hardik Pandya meets kids: ఐసీసీ అకాడమీలో పిల్లలతో హార్దిక్ పాండ్యా సందడి.. ఫ్యాన్స్ రియాక్షన్!!

Hardik Pandya meets kids: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దుబాయ్‌లో తన అభిమానులతో ప్రత్యేకమైన అనుభూతిని పంచుకున్నాడు. ఐసీసీ అకాడమీలో ప్రాక్టీస్ సెషన్ కోసం వచ్చిన టీమిండియా ఆటగాళ్లను అక్కడి చిన్న పిల్లలు చుట్టుముట్టారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ను చూసిన పిల్లలు ఆనందంతో నిండిపోయారు. హార్దిక్ కూడా వారితో కలిసిమెలిసి మాట్లాడి, ఫొటోలు దిగాడు.
Hardik Pandya meets kids in Dubai
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా న్యూజిలాండ్‌తో మార్చి 2న జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా ప్రాక్టీస్ ప్రారంభించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ప్రాక్టీస్ మొదలుపెట్టే ముందు, అక్కడి చిన్నారులు అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా లతో కలిసి ఆటోగ్రాఫ్‌లు తీసుకుని సెల్ఫీలు దిగారు.
హార్దిక్ తన ముచ్చటైన స్వభావంతో చిన్నారులతో కాసేపు ముచ్చటించి, వారితో క్రికెట్ ఆడి, సరదాగా గడిపాడు. ఐసీసీ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్‌లో హార్దిక్ పిల్లలతో ఉన్న ఫొటోలు షేర్ చేయగా, అవి వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ “హార్దిక్ క్రేజ్ మామూలుగా లేదు!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
టీమిండియా విజయాల్లో హార్దిక్ పాండ్యా కీలక భూమిక పోషిస్తున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ ను అవుట్ చేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ, భారత జట్టు సెమీ ఫైనల్ ఆశలను బలపరుస్తున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో హార్దిక్ ప్రదర్శన టీమిండియా విజయాల్లో కీలకం అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.