Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి భారీ నిరాశ.. ఈ ఏడాది కూడా సినిమాలు లేనట్లే!!

Hari Hara Veera Mallu Shooting

Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న భారీ చిత్రం “హరిహర వీరమల్లు” పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న విషయం తెలిసిందే. పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక రాబోతున్న ఈ సినిమా పై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతి కృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాడిన పాట విడుదలపై అధికారిక ప్రకటన వెలువడడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 6న ఈ పాట విడుదల కానుందని మేకర్స్ వెల్లడించినా, అనూహ్యంగా ఈ విడుదల వాయిదా పడింది.

Hari Hara Veera Mallu song delayed

తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో మేకర్స్ స్పందిస్తూ, మా మొదటి సింగిల్ ‘మాట వినాలి’ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న మీకు మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. యితే, పాటను అత్యుత్తమ స్థాయిలో మీకు అందించేందుకు మేము కొంత అదనపు సమయం తీసుకోవాల్సి వచ్చింది” అని తెలిపారు. ఈ ప్రకటన అభిమానుల్లో కొంత నిరాశ కలిగించినప్పటికీ, ఉత్తమమైన పాట అందించాలనే మేకర్స్ ప్రయత్నాన్ని వారంతా స్వాగతిస్తున్నారు.

ఎప్పటి నుంచో ఈ పాట కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇప్పుడు మరోసారి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, సాంకేతికతలో ఎలాంటి లోపం లేకుండా అత్యుత్తమ సౌండ్ క్వాలిటీతో పాటను అందించాలనే నిర్మాతల నిబద్ధతపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట కేవలం సంగీత ప్రియులను మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంతో రూపొందిన “హరిహర వీరమల్లు” ఒక చారిత్రాత్మక కథతో ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ చిత్రం 2023లో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, అప్పటి నుంచి పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత రాకపోయినా, ఈ సినిమా పవన్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం దక్కించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *