Hari Hara VeeraMallu: నిర్మాతలను ఏడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ విడుదల!!

Hari Hara VeeraMallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు సినిమా ఇదిగో అదిగో అంటూ గత కొన్ని సంవత్సరాలుగా ఊరిస్తూ వస్తుంది. పలుమార్లు విడుదల చేస్తామని నిర్మాతలు ఎన్నిసార్లు ప్రకటించినప్పటికీ విడుదల కాలేదు. ఇప్పుడు మే 9 న విడుదల చేస్తామని ప్రకటించినా కొన్ని కీలక సన్నివేశాలు ఇంకా చిత్రీకరించాల్సి ఉన్నందున ఈ తేదీకి సినిమా విడుదల చేయడం కష్టమే అంటున్నారు. ఆ సన్నివేశాలను తీయడానికి పవన్ కళ్యాణ్ కనీసం వారం రోజుల కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుంది.
Hari Hara VeeraMallu release issues
ఏప్రిల్ నెల సగం దాటినా, పవన్ కళ్యాణ్ ఎప్పుడు సమయం ఇస్తారో తెలియడం లేదు. ఈ సన్నివేశాలు CGI workతో ఉండటంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మరింత సమయం తీసుకుంటాయి. ఈ కారణంగా మే 9న విడుదల చేయడం చాలా కష్టంగా ఉంది.
ఇన్‌సైడ్ వర్గాల ప్రకారం, పవన్ కళ్యాణ్ లేని సన్నివేశాలతో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు ప్రొడ్యూసర్స్. అయితే, అలా చేస్తే సినిమా క్వాలిటీ గా ఉండదు అని ఆందోళన వ్యక్తం అవుతోంది. పవన్ తన డేట్లు ఇవ్వకుండా ఉంటే, హరి హర వీరమల్లు సినిమాను అసంపూర్ణంగా విడుదల చేస్తే అది అభిమానులను నిరాశపరిచే ప్రమాదం ఉంటుంది.
మరోవైపు, పవన్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదానికి గురై గాయపడ్డాడు, అలాంటి పరిస్థితిలో షూటింగ్‌కు రావడం ఎంతవరకు వీలవుతుందో తెలీదు. మే 9 న సినిమా విడుదల చేయాలంటే మాత్రం ఉన్న కొన్ని సన్నివేశాలను వదిలి పెట్టాలని లేదా మరో తేదీని ఎంచుకోవాలని నిర్ణయించుకోవాలని నిర్మాతలు డిసైడ్ అవుతున్నారు. మొత్తానికి ఈ సినిమా వాయిదా తప్పక తప్పదనిపిస్తోంది.