Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన హరీష్ రావు ?
Harish Rao: తెలంగాణ అప్పుల చిట్టా బయట పెట్టారు హరీష్ రావు. రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం బట్టబయలైందని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక, బీఆర్ఎస్ హయాంలో అప్పులపై దుష్ప్రచారం చేస్తూ తప్పించుకోవాలని సీఎం రేవంత్ గారు ప్రయత్నించారని వెల్లడించారు. సభలో కాగ్ రిపోర్టుతో అన్ని ఆధారాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏడాదికి చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని చెప్పారు.

Harish Rao reveals Telangana’s debt list
Bendakaya: బెండకాయ నీటిని తాగితే.. 100 రోగాలకు చెక్ ?
16 నెలలుగా మేం ఏం చెప్పామో, కాగ్ రిపోర్టు కూడా అదే చెప్పింది… భట్టి విక్రమార్క గారు కూడా అసెంబ్లీలో అదే విషయం చెప్పారన్నారు. బీఆర్ఎస్ పదేండ్లలో చేసిన అప్పు రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే.. ఏటా రూ. 41 వేల కోట్లు లేదా రూ. 42 వేల కోట్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో రూ. లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది, చేసిన పని సున్నా అన్నారు.
Paneer: పన్నీరు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?
16 నెలల అప్పులు కట్టడానికి రూ. 88,564 కోట్లు ఖర్చు పెట్టామని 7 గంటల 44 నిమిషాలకు చెప్పారని చెప్పారు. సీఎం గారు ఇదే విషయమై 3 గంటల 58 నిమిషాలకు ఇదే అసెంబ్లీలో ఏం చెప్పారంటే.. మేం రూ. 1,53,359 కోట్లు అప్పులు, మిత్తీల కింద చెల్లించామని చెప్పారు… అంటే నాలుగు గంటల్లోనే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి మధ్య రూ. 70 వేల కోట్ల తేడా వచ్చిందన్నారు హరీష్ రావు.
Dal: కందిపప్పు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?