Harish Shankar: తమ్ముడి వల్లే నేను పిల్లల్ని కనడం లేదు.?

Harish Shankar: స్టార్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్ల లిస్టులో హరీష్ శంకర్ పేరు కూడా ఉంటుంది. ఈయన చేసిన మిరపకాయ్, గద్దలకొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలకు డైరెక్షన్ చేశారు.ఇక ఈయన దర్శకత్వం వహించిన రామయ్య వస్తావయ్యా, షాక్,మిస్టర్ బచ్చన్ వంటి రెండు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి.
Harish Shankar shocking comments on childrens
గత ఏడాది మిస్టర్ బచ్చన్ అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే హరీష్ శంకర్ పెళ్లయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిల్లల్ని కనలేదు.దాంతో చాలామంది హరీష్ శంకర్ కి ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అని కొన్ని రూమర్లు క్రియేట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అయితే హరీష్ శంకర్ పెళ్ళై ఇన్ని రోజులైనా కూడా తనకి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇదే అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని బయటపెట్టారు.(Harish Shankar)
Also Read: Genelia: జెనీలియాకి భర్త టార్చర్.. సినిమాలు చేస్తానంటే అలా అన్నారా.?
హరీష్ శంకర్ మాట్లాడుతూ.. పిల్లల్ని కనకపోవడానికి కారణం మా నిర్ణయమే.నా భార్య నేను పిల్లల్ని కనకూడదని నిర్ణయం తీసుకున్నాం. దానికి కారణం మా ఇంట్లో పరిస్థితిలే..మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.కాబట్టి ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉండవు.అందుకే నా చెల్లి తమ్ముడు పెళ్లి చేసి వారిని జీవితంలో బాగా సెట్ చేయాలి అని నిర్ణయించుకున్నాను.

ఒకవేళ పిల్లలు పుడితే వారిపై ప్రేమ పెరిగి వీరిని వదిలేస్తాను. నా స్వార్థం నేనే చూసుకుంటాను అందుకే ఈ స్వార్థం ఉండకుండా ఉండాలంటే ఫస్ట్ పిల్లల్ని కనకూడదు అని నిర్ణయం తీసుకున్నాను. అందుకే ఇప్పటి వరకు పిల్లల్ని కనలేదు అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ సంచలన కామెంట్స్ చేశారు.(Harish Shankar)