Daku Maharaj: డాకూ మహారాజ్ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా.. నిరాశలో ఫ్యాన్స్.?

Daku Maharaj: బాబి కొల్లి దర్శకత్వంలో వస్తున్న డాకూ మహరాజ్ కి సంబంధించి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ట్రైలర్ చూసిన నందమూరి ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ సినిమా అంటే ఈ లెవల్ లో కాదు వేరే లెవెల్లో ఊహించుకున్నామని మాట్లాడుకుంటున్నారు. అయితే డాకు మహారాజ్ విడుదలకు ముందు ఈ సినిమా నిర్మాత అయినటువంటి నాగవంశీ మెగాస్టార్ అభిమానులు తిట్టుకున్న పర్వాలేదు ఫీలయినా పర్వాలేదు..

Have you noticed this mistake in the trailer of Daku Maharaj

Have you noticed this mistake in the trailer of Daku Maharaj

కానీ వాల్తేరు వీరయ్య సినిమా కంటే డాకూ మహారాజ్ మూవీ ఎన్నో రెట్లు బెస్ట్ గా ఉంటుంది. ఈ సినిమా చూసిన వాళ్లు కచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మెగాస్టార్ ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్న పర్వాలేదు ఈ సినిమా మాత్రం బాగుంటుంది అంటూ డాకు మహారాజ్ సినిమాపై ఎన్ని గొప్పలు చెప్పారా చెప్పనక్కర్లేదు. కానీ తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే మాత్రం చాలా మంది నందమూరి ఫ్యాన్స్ హర్ట్ అయిపోయారు. (Daku Maharaj)

Also Read: Daaku Maharaj Trailer: డాకు మహారాజ్.. నెగెటివిటీ అంతా ట్రైలర్ తో పోవాలి!!

అయితే ఈ ట్రైలర్ లో తమన్ మ్యూజిక్ అస్సలు బాలేదని, తమన్ బాలకృష్ణ రేంజ్ కి తగ్గట్టు మ్యూజిక్ ఇవ్వలేకపోయారని పెదవి విరుస్తున్నారు. అలాగే తాజాగా విడుదలైన ట్రైలర్లో బాలకృష్ణకు సంబంధించి ఒక్క మాస్ డైలాగ్ కూడా లేదు.ఇక ఇదే అతి పెద్ద మిస్టేక్ అని, బాబి చేసిన మిస్టేక్ ట్రైలర్లో బాలకృష్ణకు సంబంధించి ఒక్క డైలాగ్ కూడా పెట్టకపోవడం అంటున్నారు చాలామంది నందమూరి ఫ్యాన్స్.

Have you noticed this mistake in the trailer of Daku Maharaj

ఎందుకంటే బాలకృష్ణ పేరెత్తగానే అందరికీ మాస్ డైలాగ్స్ గుర్తుకొస్తాయి. కానీ తాజాగా విడుదలైన డాకు మహారాజ్ ట్రైలర్ లో ఒక్క మాస్ డైలాగ్ కూడా లేకపోవడంతో బాలకృష్ణ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. మరి చూడాలి సినిమా కూడా ఇలాగే ఉంటుందా లేక సినిమాలో ఇంకేదైనా కొత్తదనం ఉంటుందా అనేది.(Daku Maharaj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *