Bitter Gourd: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. నేటి కాలంలో చాలామంది డయాబెటిస్ వ్యాధికి గురవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి కాకరకాయ ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. కాకరకాయ తినడం వల్ల శరీరంలోని వివిధ రకాల వ్యాధులు నయమవుతాయి. కాకరకాయ తినడం వల్ల B1, B2, B3 శరీరానికి అందుతాయి. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. Bitter Gourd
Health Benefits Of Bitter Gourd
అందువల్ల శరీరానికి, ఎముకలకు బలం లభిస్తుంది. కాకరకాయలో మెగ్నీషియం, ఫాస్ఫరస్, మాంగనీస్, జింక్, ఫోలేట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ప్రతి అవయవాన్ని బలంగా తయారు చేయడానికి సహాయం చేస్తుంది. కాకరకాయ రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను తగ్గించడానికి ముఖ్యపాత్ర పోషిస్తాయి. డయాబెటిక్ పేషెంట్లకు కాకరకాయ ఒక అద్భుతమైన వరం అని చెప్పవచ్చు. Bitter Gourd
Also Read: Aryaman Birla: ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెటర్ ఇండియా వాడే…రూ.80వేల కోట్లు?
కాకరకాయ కూరను డయాబెటిక్ పేషెంట్లు వారంలో రెండు మూడుసార్లు తప్పకుండా తినాలి. అంతేకాకుండా కాకరకాయ జ్యూస్ కూడా తాగినట్లయితే క్రమక్రమంగా మధుమేహం వ్యాధి తగ్గుతుందని చెప్పవచ్చు. కాకరకాయలో ఇన్సులిన్ ను ప్రేరేపించే సమ్మేళనాలు ఉండడం వల్ల రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడానికి సహాయం చేస్తాయి. కాకరకాయలో క్యాలరీలు తక్కువగాను, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి కాకరకాయ ఎంతో చక్కగా పనిచేస్తుంది. Bitter Gourd
ఇది శరీరంలోని జీవక్రియను పెంచడానికి సహాయం చేస్తుంది. కాకరకాయ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. కాకరకాయ జ్యూస్ ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. ముఖ్యంగా కాకరకాయ తినడం వల్ల గుండెపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది చర్మానికి ఎంతో మేలులు చేస్తాయి. కాకరకాయ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉండడం వల్ల శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ కాకరకాయను తప్పకుండా తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Bitter Gourd