Cucumber: కీర దోస తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి ?
Cucumber: ఎండాకాలంలో చాలామంది తినే వాటిలో కీర దోస ఒకటి. ఎండలో శరీరానికి చలువనిస్తోంది. కీరదోసలో ఎన్నో రకాల పోషకాలు నిండి ఉంటాయి. ఈ దోసకాయ తినడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోవడంతో పాటు కొవ్వు సైతం కరిగిపోతుంది. బరువు చాలా అదుపులో ఉంటుంది. ఎండలో మాత్రమే కాకుండా చల్లటి వాతావరణంలో కూడా కీర దోస తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. కీరదోస తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.
Health Benefits of Cucumbers
ఇందులో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల మలబద్దకాన్ని దూరం చేస్తుంది. కీరదోస చర్మానికి ఎంతో మేలును కలిగిస్తుంది. చాలామంది కీరదోసను ఫేస్ ప్యాక్ లు, బ్యూటీ ఉత్పత్తులలో వాడుతూ ఉంటారు. కీరదోసలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి దీనిని తినడం వల్ల చర్మం సహజంగా, కాంతివంతంగా తయారవుతుంది. కీరదోస తినడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాలు తొలగిపోతాయి. కీరదోస ప్రతి రోజు తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో దోసకాయ తినడం వల్ల క్యాలరీలు తగ్గడమే కాకుండా బరువు కూడా తగ్గుతాము. దోసకాయలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. ఎముకలు బలహీన పడకుండా కాపాడుతాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఐరన్, వాటర్ కంటెంట్ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయం చేస్తాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్థాలలో కీరదోస ముందు వరుసలో ఉంటుంది. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీనిని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందవచ్చు. తద్వారా చలువ చేస్తుంది. బీపీ ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యానికి చాలా ప్రమాదం. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కీరదోస ప్రతి రోజు తినడం వల్ల సమస్య తొలగిపోతుందని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.