Fennel Seeds: సొంపు తిన్నాక వేసుకుంటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Fennel Seeds: సహజ సిద్ధమైన మౌత్ ఫ్రెషనర్ గా సోంపును వాడుతూ ఉంటారు. ఇది రుచి మాత్రమే కాకుండా సువాసనను వెదజల్లుతుంది. సోంపు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇంట్లోనే సోంపు వాటర్ తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Health Benefits of Fennel Seeds
బరువు తగ్గాలనుకునే వారు ఉదయం పూట సోంపు వాటర్ తాగినట్లయితే అతి తక్కువ సమయంలోనే బరువు తగ్గుతారు. సోంపు వాటర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. భోజనం చేసిన అనంతరం సోంపును చాలామంది తింటూ ఉంటారు. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం కావడానికి ఎంతగానో సహాయం చేస్తుంది.
Gilchrist: రోహిత్ పై ఫైర్…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో..?
ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు శరీరానికి మేలు కలిగిస్తాయి. సోంపు వాటర్ తో సులభంగా బరువు తగ్గడమే కాకుండా ఎనర్జీ వస్తుంది. నీరసం లాంటి సమస్యలు తొలగిపోతాయి. సోంపులో అధికంగా ఫైబర్ ఉండడం వల్ల ఆకలి అనిపించదు. శరీరంలోనే కొవ్వు సులభంగా కరుగుతుంది. ఇది శరీరంలోని పోషకాలను గ్రహించడానికి సహాయం చేస్తుంది. సోంపు తిన్నట్లయితే శరీరంలోనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సోంపుతో చర్మ సంరక్షణ, స్త్రీలలో రుతుక్రమ సమస్యలు తొలగిపోతాయి.