Jaggery: బెల్లం తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!!
Jaggery: బెల్లం తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అందుకే చెక్కలకు బదులుగా బెల్లం తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. బెల్లం తినడం ద్వారా మీ బరువు అదుపులో ఉండటమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధి నుంచి కూడా బయటపడవచ్చు. బెల్లం ని ఏ సీజన్ లో నైనా తీసుకోవచ్చు. కానీ శీతాకాలంలో పలు సమస్యలను ఎదుర్కొనేందుకు ఎక్కువగా బెల్లం తీసుకుంటారు. కడుపు సమస్యలు, రక్తహీనత తదితర సమస్యలకు క్రమం తప్పకుండా బెల్లం తినడం మంచిది. అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. బెల్లం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Health Benefits of Jaggery Consumption
ఐరన్ లోపం ఉన్నవారు తప్పనిసరిగా బెల్లం తీసుకోవాలి. ఎందుకంటే ఐరన్ పోలేట్ వంటి పోషకాలు బెల్లంలో ఉంటాయి.ఇవి శరీరంలోని రైల్ బ్లడ్ సెల్స్ ను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. బెల్లం తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి కూడా చాలా ఉపశమనం పొందుతారు. చలికాలంలో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు ప్రతి ఒక్కరు బెల్లం తినాలి.
బెల్లం తినడం వల్ల శరీరానికి ఎముకలకు బలం చేకూరుతుంది. బెల్లం శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా జీర్ణక్రియ రేటును కూడా నియంత్రిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లలో కూడా బెల్లం ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు. బెల్లం తినడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇది కాకుండా పెరుగుతున్న బరువును కూడా నియంత్రించడానికి బెల్లం తినాలి.