Health Benefits of Raw Banana

Raw Banana: అరటిపండు చాలా పోషకరమైన పండు. దీనిని రోజు తీసుకుంటే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండును కొనడానికి చాలా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. అందుబాటు ధరలలోనే మార్కెట్లో దొరుకుతుంది. ఒక అరటి పండులో 22 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇంకా డైటరీ ఫైబర్ పొటాషియం, విటమిన్ V6,C ఎక్కువగా ఉంటుంది. అయితే పచ్చి అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అరటిపండు క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు. అరటిపండు ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

Health Benefits of Raw Banana

పచ్చి అరటి పండ్లు పసుపు అరటి పండ్ల కంటే తక్కువ చెక్కర స్థాయిని కలిగి ఉంటాయి. అందుకే అవి తక్కువ తీపిగా ఉంటాయి. పచ్చి అరటి పండ్లు దాదాపు 30 గ్లైసినిక్ సూచికలు కలిగి ఉంటాయి. పచ్చి అరటి పండ్లు గుండెకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండిన అరటి పండ్లు లో పొటాషియం ఉంటుంది. ఇది రక్త పోటును నిర్వహిస్తుంది. ఇంకా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు సమస్యను నియంత్రిస్తుంది.

Also Read: Jithender Reddy : నక్సల్స్ అన్యాయాలను ప్రశ్నించే “జితేందర్ రెడ్డి”… మూవీ రివ్యూ & రేటింగ్!!

పచ్చి అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడతాయి. తద్వారా క్యాన్సర్ ఆక్సీకర నష్టం లాంటి వ్యాధులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మనలో చాలామంది బరువు తగ్గడానికి ప్రయత్నిస్తారు. పచ్చి అరటి పండులో ఫైబర్ లభిస్తుంది. దీంతో మీకు తక్కువ కేలరీలు లభిస్తాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. తక్కువగా అన్నం తింటారు. ఇలా క్రమంగా బరువు తగ్గవచ్చు.