Saffron: శీతాకాలంలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియాలతో చాలామంది అనారోగ్యం పాలవుతారు. అయితే కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియా వంటి క్రిముల నుంచి శరీరం పోరాడుతుందని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వచ్చే చాలా రకాల వైరస్ వ్యాధులను కుంకుమపువ్వు దరిచేరనీయదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. Saffron
health benefits of saffron
కేసర్ గా పేరొందిన కుంకుమపువ్వు యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ గా పేరుగాంచింది. దీనిలో ఉండే క్రోసెట్టిన్ అనే పదార్థం కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె సమస్యలను దరిచేరనీయదు. కుంకుమ పువ్వులో ఉండే ఆంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు చలికాలంలో వచ్చే అలర్జీలను నివారిస్తుంది. కుంకుమ పువ్వుతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. కుంకుమపువ్వు టీ, కుంకుమపువ్వు తేనె, కేసర్ దూద్ కలయికలు తాగుతూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. Saffron
Also Read: CalvaryTemple: కల్వరి టెంపుల్ సతీష్‌కుమార్‌కు ఎదురుదెబ్బ ?
అంతే కాకుండా జలుబు, దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కుంకుమ పువ్వుతో ఆవిరి పట్టినట్లయితే చాలా రిలీఫ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కడుపుతో ఉన్న స్త్రీలు కుంకుమ పువ్వుతో చేసిన ఆహార పదార్థాలను రోజుకు రెండు సార్లు అయినా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల శరీరంలో ఏర్పడే అనేక రకాల ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయని చెబుతున్నారు. కడుపులోని శిశువు ఆరోగ్యం బాగుంటుందని మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. Saffron