Spinach: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో చాలామంది ఆరోగ్యంగా ఉండడానికి గల కారణం ఆకుకూరలు తినడమే. పూర్వకాలంలో మన పెద్దలు తప్పకుండా ప్రతిరోజు ఆకుకూరలు తినేవారు. అయితే అలాంటి వాటిలో పాలకూర ఒకటి. నేటి కాలంలో చాలామంది ఆకుకూరలు తినడం తగ్గించారు. కానీ పాలకూర తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుంటే దీనిని తినకుండా అసలు ఉండలేరు. Spinach
health benefits of spinach
పాలకూరలో మన శరీరానికి కావలసిన విటమిన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, క్యాలరీలు సమృద్ధిగా లభిస్తాయి. మన ఆహారంలో ప్రతిరోజు పాలకూరను చేర్చుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. పాలకూర ముఖ్యంగా కళ్లకు ఎంతో మేలును చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ల దృష్టిని మెరుగుపరుస్తుంది. కంటి సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. Spinach
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఇంటికొచ్చిన అగస్త్య..ఇక జాతర షూరు?
ఇందులో ఐరన్ ఉండడం వల్ల రక్తహీనత వంటి సమస్యలు తొలగిపోతాయి. పాలకూరలో ఫైబర్ ఉండడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతో చక్కగా పనిచేస్తుంది. పాలకూరలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి. Spinach
గుండె జబ్బులు రాకుండా కాపాడుతాయి. ఇందులో కాల్షియం, విటమిన్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలను బలపరుస్తుంది. చిన్నపిల్లలకు కూడా పాలకూరను తప్పకుండా తినిపించాలి. ఇందులో ఉండే ప్రోటీన్స్ వల్ల చిన్న పిల్లలకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా, వారి ఎదుగుదలలో ఎలాంటి లోపాలు లేకుండా చేస్తాయి. వారంలో కనీసం రెండు మూడుసార్లు అయినా పాలకూరని తినాలని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. Spinach